Just In





Pushpa 2: 'పుష్ప 2' మీద పిచ్చితో ఈ అభిమాని చేసిన పని ఏంటో తెలుసా? వీడియో వైరల్ చూశారా?
Pushpa 2 : 'పుష్ప 2' మూవీలో అల్లు అర్జున్ పోషించిన పుష్ప రాజ్ పాత్ర మూవీ లవర్స్ పై గట్టి ఎఫెక్ట్ చూపించింది. తాజాగా ఓ అభిమాని పుష్పరాజ్ గెటప్ లో హడావిడి చేసిన వీడియో వైరల్ అవుతోంది.

సెలబ్రిటీలపైన అభిమానులకు ఉండే ఇష్టం అంతా కాదు. కొంతమంది తమకు నచ్చిన హీరో హీరోయిన్ల కోసం ఏం చేయడానికి అయినా సరే వెనకాడరు. అలాంటి వారినే డైహార్డ్ ఫ్యాన్స్ అంటారు. తాజాగా పుష్ప రాజ్ అభిమాని ఒకరు ఆయన మీద అభిమానంతో చేసిన పనికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పుష్ప రాజ్ లుక్ లో సదరు అభిమాని చేసిన సందడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మహా కుంభమేళాలో పుష్పరాజ్ సందడి
డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'పుష్ప 2'. జనవరి 30 నుంచి ఈ మూవీ ఓటీటీలో కూడా అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యి, దాదాపు నెల రోజులకు పైగానే పూర్తయినప్పటికీ ఇంకా ఆ క్రేజ్, ఎఫెక్ట్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటిదాకా థియేటర్లలో భారీ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపిన పుష్పరాజ్, ఇప్పుడు ఓటీటీలో కొత్త రికార్డులను క్రియేట్ చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మహా కుంభమేళాలో పుష్పరాజ్ సందడి చేశాడు. అయితే ఆయన ఒరిజినల్ పుష్పరాజ్ కాదండోయ్... అచ్చం ఆయనలా తయారైన బన్నీ అభిమాని.
కేవలం పుష్ప రాజ్ లా తయారవ్వడం మాత్రమే కాదు 'పుష్ప 2' సినిమాలో అల్లు అర్జున్ వేసుకున్న డిజైన్ తో ఉన్న షర్ట్, గడ్డం, హెయిర్ స్టైల్, గ్లాసెస్, మేనరిజం... ఇలా పుష్ప రాజ్ ని అచ్చుగుద్దినట్టు దింపేశాడు. పైగా నోట్లో పాన్ మసాలా వేసుకొని నములుతూ "పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్... పుష్ప నేషనల్ కాదు ఇంటర్నేషనల్" అంటూ అల్లు అర్జున్ రేంజ్ లో డైలాగులు చెబుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read: చిరుత ఏవరేజా... ఏంటిది అల్లు మామ? అప్పుడు చిరుకు కృతజ్ఞత... ఇప్పుడు మేనల్లుడి మీద ఎందుకీ అసూయ?
ఈ పుష్పరాజ్ డూప్ ఎవరు?
ఆ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే సదరు అభిమానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా బయటకు వచ్చాయి. అతను మహారాష్ట్ర కు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. మహా కుంభమేళా సందర్భంగా అక్కడ పవిత్ర స్నానానికి బయల్దేరిన ఈ వ్యక్తి పుష్పరాజ్ గెటప్ లో కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. దూరం నుంచి చూసి నిజంగానే పుష్పరాజ్ వచ్చాడు అనుకున్నారో ఏమోగానీ... అతన్ని చూడడానికి జనాలు భారీ సంఖ్యలో గుమిగూడారు. ఇక పోలీసుల సైతం పుష్పరాజ్ స్టైల్లో అతను చెప్పే డైలాగ్ లను చూస్తూ ఉండిపోయారు. కొంతమంది సోషల్ మీడియా ద్వారా పుష్పరాజ్ లా యాక్ట్ చేసిన ఆ వ్యక్తిని ప్రశంసిస్తుంటే, మరి కొంతమంది మాత్రం మహా కుంభమేళాలో ఇలాంటి పనులు చేయడమేంటి? అంటూ విమర్శిస్తున్నారు.
ఇదిలా ఉండగా మరో వైపు 'పుష్ప 2' మూవీ నెట్ ఫ్లిక్స్ లో దూసుకెళ్తోంది. మిలియన్ల సంఖ్యలో వ్యూస్ తో ఈ మూవీ ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతుంది. అంతేకాకుండా దాదాపు ఏడు దేశాల్లో నెట్ ఫ్లిక్స్ లో టాప్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతున్న మూవీ కూడా ఇదే కావడం విశేషం.
Read Also : Nora Fatehi: బంగీ జంప్ చేస్తూ స్టార్ హీరోయిన్ మృతి అంటూ రూమర్స్ - అసలు నిజం ఏంటో తెలుసా?