ప్రతి మగాడి యుద్ధం వెనుక ఒక ఆడది ఉంటుంది - 'పురుషః' పోస్టర్లపై కొటేషన్స్ తెలుగు ప్రేక్షకుల్లో సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి. డిఫరెంట్ థీమ్ పోస్టర్స్... 'వైఫ్ వర్సెస్ వారియర్', 'వైఫ్ వర్సెస్ పీస్ మ్యాన్', 'వైఫ్ వర్సెస్ సిజర్ మ్యాన్' క్యాప్షన్స్ మీద ప్రేక్షకుల చూపు పడింది. ఇప్పుడు ఆ షాడో పోస్టర్లకు సినిమా టీమ్ చెక్ పెట్టింది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. 

Continues below advertisement

శ్రీకాంత్ ఓదెల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్Purushaha Movie First Look: 'స్వేచ్ఛ కోసం భర్త చేసే అలుపెరగని పోరాటం... గొప్ప గొప్ప యుద్ధాలన్నీ భార్యతో' - ఇదీ 'పురుషః' పోస్టర్ మీద మరొక కోట్. ఇప్పుడు భార్యలతో యుద్ధాలు చేసే భర్త ఎవరో ప్రేక్షకులకు చూపించారు. 

న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా 'దసరా' వంటి విజయవంతమైన సినిమా తీసిన దర్శకుడు... నానితో మరోసారి 'ది ప్యారడైజ్' సినిమా తీస్తున్న శ్రీకాంత్ ఓదెల చేతుల మీదుగా 'పురుషః' ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. అందులో హీరో బత్తుల పవన్ కళ్యాణ్ (Battula Pawan Kalyan)తో పాటు సప్తగిరి, రాజ్ కుమార్ కసిరెడ్డిని చూపించారు. ఈ సినిమాలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ కథానాయికలు.

Continues below advertisement

పెళ్లి తర్వాత జీవితం యుద్ధభూమి!'బ్రహ్మచారి భర్త కావాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధ భూమిగా మారుతుంది' అని 'పురుషః' ఫస్ట్ లుక్ పోస్టర్ మీద కొటేషన్ ఉంది. అంటే... పెళ్లి తర్వాత జీవితం యుద్ధమే అని పరోక్షంగా, ఆ మాటలతో చెప్పారు అన్నమాట. హాలీవుడ్ సూపర్ హీరోల స్ఫూర్తితో హీరో, మిగతా ఇద్దరు ప్రధాన పాత్రల లుక్స్ డిజైన్ చేసినట్టు కనబడుతోంది.

Also Read: 'చికిరి' మీనింగ్ చెప్పారోచ్... పెద్ది ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది... రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్

'పురుషః' సినిమాతో బత్తుల పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు, ఈ సినిమాను బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ పతాకంపై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. దీనికి వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. 'పురుషః' సినిమాలో 'వెన్నెల' కిశోర్, వీటీవీ గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్, గబి రాక్, అనైరా గుప్తా ప్రధాన తారాగణం. త్వరలో సినిమా విడుదల తేదీ అనౌన్స్ చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: శ్రవణ్ భరద్వాజ్, ఛాయాగ్రహణం: సతీష్ ముత్యాల, కూర్పు: కోటి, కళ: రవిబాబు దొండపాటి, సాహిత్యం: అనంత శ్రీరామ్.

Also Readరష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... సినిమా చూసినోళ్లు ఏం చెబుతున్నారంటే?