పవన్ కళ్యాణ్‌కు 'బద్రి', మహేష్ బాబుకు 'పోకిరి' & 'బిజినెస్‌మ్యాన్', అల్లు అర్జున్‌కు 'దేశముదురు' & 'ఇద్దరమ్మాయిలతో', రవితేజకు 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' & 'ఇడియట్', ఎన్టీఆర్‌కు 'టెంపర్'... చెబుతూ వెళితే బోలెడు సినిమాలు. హీరోలు అందరికీ దర్శకుడు పూరి జగన్నాథ్ హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. పూరి తీసిన హిట్స్‌లో మాత్రమే కాదు... ఫ్లాప్స్‌లోనూ హీరోలకు రాసిన క్యారెక్టర్లు ప్రత్యేకంగా ఉంటాయి. అటువంటి పూరి సరైన హిట్ చూసి చాలా రోజులైంది. ఆయన కెరీర్ డౌన్ ఫాల్ వెనుక ఉన్నది ఛార్మి కౌర్ అంటున్నారు నటుడు అజాజ్ ఖాన్ (Azaz Khan).

Continues below advertisement

పెళ్ళాం పిల్లల్ని వదిలేస్తే సౌత్ జనాలకు నచ్చదురామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'రక్త చరిత్ర'లో అజాజ్ ఖాన్ నటించారు. అతడి తొలి తెలుగు చిత్రమది. ఆ తర్వాత 'దూకుడు' చేశారు. నితిన్ 'హార్ట్ ఎటాక్'తో పూరి జగన్నాథ్ కాంపౌండ్‌లో అడుగు పెట్టారు. 'టెంపర్', 'రోగ్' సినిమాలు చేశారు. రీసెంట్‌గా పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఛార్మి కౌర్ మీద ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పూరి జగన్నాథ్ కెరీర్ నాశనం కావడానికి కారణం ఆయన దగ్గరకు ఛార్మి కౌర్ రావడమే అని అజాజ్ ఖాన్ కామెంట్ చేశారు.

''రామ్ గోపాల్ వర్మను పూరి జగన్నాథ్ ఫాలో అయ్యాడని తెలుగు ప్రేక్షకులు భావించారు. ఆయన్ను ఎలా చూశారంటే... రామ్ గోపాల్ వర్మ నాశనానికి కారణం ఏమిటి? భార్యా బిడ్డలను వదిలేశాడు. పూరి జగన్నాథ్ కూడా పెళ్ళాన్ని వదిలేశారు. పిల్లలను వదిలేశారు. సౌత్ జనాల (ప్రేక్షకుల) దృష్టిలో విలన్ అయ్యాడు. దక్షిణాది ప్రజలకు పెళ్ళాం పిల్లలు వదిలేసిన మనుషులు అంటే నచ్చదు. హీరోలు రెస్పెక్ట్ ఇవ్వడం అనేశారు'' అని అజాజ్ ఖాన్ తెలిపారు.

Continues below advertisement

Also ReadOG 2 Update - పవన్ ఫుల్ హ్యాపీ... 'ఓజీ 2'కు అంతా రెడీ... సుజీత్ క్లూస్ ఇచ్చారా?

ఛార్మి కౌర్ కంట్రోల్‌లో పూరి... అంతా నాశనం!పూరి జగన్నాథ్ చాలా మంచి వ్యక్తి అని, ఆయన నాశనం కావడానికి కారణం ఛార్మి కౌర్ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు అజాజ్ ఖాన్. ''నాకు నాలుగు సినిమాల్లో పూరి జగన్నాథ్ అవకాశాలు ఇచ్చారు. ఆయన ప్రయాణాన్ని దగ్గర నుంచి చూశా. నాకు ఆయన చాలా క్లోజ్. సినిమా షూటింగ్స్ లేని సమయాల్లో కూడా గోవాకు రమ్మని చెప్పేవారు. నా తర్వాతే ఆయన దగ్గరకు ఛార్మి వచ్చింది. ఆవిడ వచ్చిన తర్వాత ఆయనకు దగ్గరైన వాళ్ళంతా దూరమయ్యారు. పూరిని ఛార్మి కంట్రోల్ చేసింది. తన చెప్పు చేతల్లో ఉంచుకుంది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ పతనం మొదలైంది. ఆయన కంపెనీ పడిపోయింది. కుటుంబం నాశనం అయ్యింది'' అని పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో అజాజ్ ఖాన్ వ్యాఖ్యలు చేశారు.

Also ReadSamantha Announces Maternity Leave - మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నా... ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన సమంత

చిరంజీవి నుంచి మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలు అందరూ పూరిని 'సార్ సార్' అని పిలిచేవారని... అటువంటి వ్యక్తి పతనం వెనుక ఉన్నది ఛార్మి అని అజాజ్ ఖాన్ ఒకటికి రెండుసార్లు చెప్పడం చర్చనీయాంశం అయ్యింది. తాను వ్యక్తిగతంగా ఒకరిని టార్గెట్ చేయాలని అనుకోవడం లేదని, అలాగే ఒకరిని ఇన్సల్ట్ చేయడం కూడా తన ఆలోచన కాదని అజాజ్ ఖాన్ అన్నారు. తాను దగ్గర నుంచి చూసినది చెప్పానని, ఒకవేళ తన అభిప్రాయంతో ఎవరైనా విభేదిస్తే అది వాళ్ళ ఇష్టమని చెప్పుకొచ్చారు. ఇప్పుడీ రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also ReadNBK112 Launch - నారా లోకేష్ క్లాప్‌తో మొదలైన బాలయ్య సినిమా... అమరావతిలో ఎన్‌బీకే112 షురూ