Chennai Love Story : కిరణ్ అబ్బవరం సినిమాకు 100 కోట్ల కలెక్షన్స్ - ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ ఇదే
Kiran Abbavaram : ఈ ఏడాది చెన్నై లవ్ స్టోరీ బిగ్గెస్ట్ హిట్ అవుతుందని చెప్పారు ప్రొడ్యూసర్ ధీరజ్ మొగలినేని. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

Producer Dheeraj Mogilineni About Kiran Abbavaram's Chennai Love Story Movie : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పారు ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
'100 కోట్లు కలెక్ట్ చేస్తుంది'
ఈ ఏడాది ఈ సినిమా రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పారు ధీరజ్ మొగిలినేని. '2026లో బిగ్గెస్ బ్లాక్ బస్టర్ అవుతుంది. అప్పటివరకూ ఆడియన్స్ దీన్ని వదలరు. మేము కూడా వదలం.' అని అన్నారు. ఈ సినిమాకు బేబీ ఫేం సాయి రాజేష్ స్టోరీ అందించడంతో పాటు SKNతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా... మెలోడీ కింగ్ మణిశర్మ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్ ట్రెండ్ క్రియేట్ చేస్తుండగా... రెండో పాట మరింత అంచనాలు పెంచేసింది. వదలనే అంటూ సాగే లవ్ సాంగ్ ఆకట్టుకుంటోంది.
Also Read : ఒక్కొక్కర్నీ కొడతాను చూడు... ప్రేమతో అబ్బా - మా ఇంటి బంగారం ఈవెంట్‌లో సమంత... ఆ ఇద్దరూ పర్ఫెక్ట్ అన్న సామ్
'మణిశర్మ గారి మాటలు నమ్మొద్దు'
'నా హార్మోనియం ఎక్కడుందో కూడా నేను మర్చిపోయా. సాయి రాజేష్ వెతికి పట్టుకుని మరీ దుమ్ము దులిపి తీసుకొచ్చి నా ముందు పెట్టారు. అలా వర్క్ స్టార్ట్ చేస్తే... ట్యూన్ పాజిటివ్ వైబ్ వచ్చింది. అలా మూవీ ట్యూన్స్ అన్నీ చేయించుకున్నాం.' ఇదీ ఫస్ట్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో మణిశర్మ చేసిన కామెంట్స్... దీనిపై డైరెక్టర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ రియాక్ట్ అయ్యారు.
'మణిశర్మ గారి ఇంట్లోకి గేట్ తెరుచుకుని లోపలికి వెళ్తుంటే బెంజ్ కారు కనిపించింది. అది చూసి నేను కారు ఎప్పుడు కొనుక్కుంటానా అని అనిపించింది. ఆఫీస్ చూసి ఇలాంటి ఆఫీస్ ఎప్పుడు కట్టించుకోవాలని లోపలికి వెళ్లా. ఆయన టకీలా కలెక్షన్స్‌తో చిన్న ఇండిపెండెట్ ఫిల్మ్ తియ్యొచ్చు. నేను హార్మోనియం దుమ్ము దులుపుతుంటుంటే నేను ఛాన్స్ ఇచ్చారని చెప్పారు. అప్పటికీ ఇప్పటికీ ఆయన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్.
నేను మెలోడీస్ అడిగాను. సినిమాలో 7 పాటలు మెలోడీస్ కావాలని అడిగా. ఆయన్ను అలా రిక్వెస్ట్ చేసి చేయించుకున్న సినిమా. ఆయన అప్పుడు చెప్పింది ఈ సందర్భంలోనే. ఆయన మాటలు నమ్మొద్దు.' అని చెప్పారు.
Also Read : మా ఇంటి బంగారం ట్రైలర్ - చాలా రోజుల తర్వాత ఫుల్ యాక్షన్ మోడ్‌లో సమంత
ఒకే చోట 10 మంది మ్యూజిక్ డైరెక్టర్స్
సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ఒకే చోట 10 మందికి పైగా మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మణిశర్మ, కీరవాణి, అనూప్ రూబెన్స్, మాధవపెద్ది సురేశ్, వివేక్ సాగర్, కల్యాణి మాలిక్, గౌరా హరి, సురేశ్ బొబ్బిలి, శ్రీ చరణ్ తదితరులు ఈవెంట్‌లో సందడి చేశారు. చెన్నై లవ్ స్టోరీ తెలుగులో తొలి డాల్బీ ఆడియో సినిమాగా రూపొందుతోంది.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















