Spirit Movie : ప్రభాస్ 'స్పిరిట్' నుంచి ఎగ్జిట్ అంటూ ప్రచారం - ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్... ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా...
Prakash Raj Reaction : ప్రభాస్ 'స్పిరిట్' మూవీ నుంచి తాను తప్పుకొన్నట్లు సాగుతున్న ప్రచారంపై నటుడు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

Prakash Raj Breaks Silence On Prabhas Spirit Exit Rumours : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో పాన్ వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మూవీ 'స్పిరిట్'. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ టీజర్ ఇండస్ట్రీనే షేక్ చేసింది. డార్లింగ్ ప్రభాస్‌తో పాటు ప్రకాష్ రాజ్ డైలాగ్స్ కూడా ఆ టీజర్‌లో హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా, ఈ మూవీ నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకొన్నట్లు ప్రచారం సాగింది. దీనిపై ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
'అప్పుడే కథలు అల్లేస్తున్నారు'
'స్పిరిట్' మూవీ డైరెక్టర్‌తో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ప్రకాష్ రాజ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దీనిపై స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. 'స్పిరిట్ మూవీ గురించి విషపూరిత నకిలీ ప్రచారం చేస్తున్న వారికి నేను చెప్పేది ఒకటే. సినిమాలో ఇంకా నా సీన్స్ షూటింగ్ కూడా మొదలు పెట్టలేదు.
కానీ, మీరు అప్పుడే వాట్సాప్ ఫ్యాక్టరీలో ఏవేవో స్టోరీలు అల్లేస్తున్నారు. మీ పని మీరు చూసుకోండి. జీవితంలో గొప్పవారై బతకండి.' అంటూ నవ్వుతున్న ఎమోజీలతో ట్వీట్ చేశారు. దీంతో 'స్పిరిట్' నుంచి ఆయన ఎగ్జిట్ అయ్యారనే వార్తల్లో నిజం లేదని కన్ఫర్మ్ అయిపోయింది. ప్రస్తుతం మూవీ షూటింగ్ కొనసాగుతుండగా... త్వరలోనే ప్రకాష్ రాజ్ కూడా షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
To all the toxic #Fakenews peddlers…. On #Spirit the movie . We have not even started shooting for my scenes .. and you whatsup factories speculate stories . Grow up and have a life 😂😂😂😂. #justasking
— Prakash Raj (@prakashraaj) February 9, 2026
Also Read : హైదరాబాద్‌లో బిగ్గెస్ట్ డాల్బీ స్క్రీన్ అల్లు సినిమాస్ - బాలీవుడ్ మూవీ 'ధురంధర్ 2'తో గ్రాండ్ ఓపెనింగ్?
రిలీజ్ ఎప్పుడంటే?
ఈ మూవీలో ప్రభాస్ సరసన త్రప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా... ప్రకాష్ రాజ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన తదితరులు నటిస్తున్నారు. టీ సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన లుక్ అదిరిపోయింది. ఇప్పటివరకూ చూడని విధంగా ఓ డిఫరెంట్ రోల్‌లో డార్లింగ్ ప్రభాస్ కనిపించనున్నట్లు ఈ లుక్‌ను బట్టి తెలుస్తోంది. పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు.
పోలీస్ కథతో పాటు మాఫియా బ్యాగ్రౌండ్‌ను కూడా సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది. పోలీస్ అధికారి అయినా ప్రభాస్ జైలుకు వెళ్లినట్లు టీజర్‌లో చూపించడం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, చైనీస్, కొరియన్ సహా మరికొన్ని ఫారిన్ లాంగ్వేజీల్లో... వచ్చే ఏడాది మార్చి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. త్వరలోనే మిగిలిన అప్డేట్స్ రానున్నాయి.
























