Prabhas's The Raja Saab Pre Release Event Venue: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్‌లో వస్తోన్న కామెడీ హారర్ థ్రిల్లర్ 'ది రాజా సాబ్'. వరల్డ్ వైడ్‌గా డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ మూవీ వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, లుక్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తుండగా... ఇప్పుడు ట్రైలర్‌పై అందరి దృష్టి నెలకొంది. ఇక మూవీ ప్రమోషన్స్ కూాడా పాన్ వరల్డ్ రేంజ్‌లో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్
'రాజా సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అమెరికాలో నిర్వహించనున్నారు మేకర్స్. అమెరికాలోని ఫసిఫిక్ నార్త్ వెస్ట్ ప్రాంతంలో అతి పెద్ద నగరమైన 'సియాటెల్'లో ఈవెంట్ నిర్వహించనున్నారు. ప్రభాస్ డిసెంబర్ 20న సియాటెల్ వెళ్లనుండగా అక్కడ పెద్ద ఎత్తున ఈవెంట్ నిర్వహించేందుకు మేకర్స్ భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇక ముఖ్య అతిథిగా ఎవరు వస్తారనే దానిపై సస్పెన్స్ నెలకొంది.
Also Read: 'కల్కి' సీక్వెల్ నుంచి తీసేశాక దీపికా ఫస్ట్ పోస్ట్ - షారుక్ మూవీ కోసం ప్రభాస్ సినిమా వదులుకున్నారా?
ట్రైలర్ ఎప్పుడంటే?
ప్రభాస్ ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్ మూవీలో నటిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. ఇక ట్రైలర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుండగా... అక్టోబర్ 1న రిలీజ్ చేయనున్నట్లు ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. అక్టోబర్ 1న ట్రైలర్ యూట్యూబ్‌లో అందుబాటులో ఉండగా... రిషభ్ శెట్టి 'కాంతార' మూవీతో పాటు థియేటర్లలో ట్రైలర్‌ను ప్రదర్శించనున్నారు. సినిమా రిలీజ్‌కు ముందు మరో ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేసేందుకు టీం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజా అనే చెప్పాలి.
ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ సాంగ్‌ను కూడా అక్టోబర్ 23న రిలీజ్ చేసేందుకు టీం ప్లాన్ చేస్తోంది. ఈ సాంగ్ కోసం ఇప్పటికే టీం కేరళలో షూటింగ్ జరుపుతోంది. మ్యూజిక్ లెజెండ్ తమన్ ఈ పాటకు ట్యూన్ ఇవ్వగా... సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించనున్నారు. ఇక ఈ పాట ఫుల్ వీడియోను రిలీజ్ చేస్తారా? లేక కేవలం లిరికల్ వీడియో మాత్రమే రిలీజ్ చేస్తారా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
జనవరి 9న రిలీజ్
మారుతి దర్శకత్వం వహిస్తోన్న 'ది రాజాసాబ్'లో ప్రభాస్ సరసన మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. వీరితో పాటు సప్తగిరి వీటీవీ గణేష్, ప్రభాస్ శ్రీను, బొమ్మన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ మూవీని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.