Puri Sethupathi Latest Update: పూరి సేతుపతి మూవీపై క్రేజీ అప్డేట్ - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
Vijay Sethupathi: విజయ్ సేతుపతి, పూరీ జగన్నాథ్ మూవీ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి మరో అప్డేట్ షేర్ చేసుకున్నారు డైరెక్టర్.

Puri Jagannadh Vijay Sethupathi Movie Update: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా టైటిల్ టీజర్ రిలీజ్ కావాల్సి ఉండగా... తమిళనాడులో కరూర్ ర్యాలీ ఘటనతో వాయిదా పడింది.
ప్రభాస్ 'స్పిరిట్' మ్యూజిక్ డైరెక్టర్
ప్రస్తుతం మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సోషల్ మీడియా వేదికగా వరుస అప్డేట్స్ షేర్ చేస్తున్నారు. తాజాగా మరో అప్డేట్ షేర్ చేశారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నర్ హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించనున్నట్లు వెల్లడించారు. 'పదాల కంటే మ్యూజిక్ బిగ్గరగా మాట్లాడే స్వరకర్తకు వెల్ కం. యాక్షన్, ఎమోషన్ మిక్స్ చేసే అద్భుతమైన మ్యూజిక్ కోసం అందరూ సిద్ధంగా ఉండాలి.' అంటూ రాసుకొచ్చారు.
స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సినిమాలకు బీజీఎం అందించి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు హర్షవర్దన్ రామేశ్వర్. ప్రస్తుతం ప్రభాస్ 'స్పిరిట్' మూవీకి కూడా ఆయనే మ్యూజిక్ అందించనున్నారు. ప్రస్తుతం 'పూరి సేతుపతి' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతుండగా... త్వరలోనే టైటిల్ టీజర్ డేట్ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి.
The blockbuster composer whose music speaks louder than words 🎵🎧
— Puri Connects (@PuriConnects) October 9, 2025
Team #PuriSethupathi welcomes National Award-winning music director @rameemusic on board ❤️🔥
Get ready for a new-age musical experience that blends action, emotion, and elevation 💥
A #PuriJagannadh film 🎬… pic.twitter.com/Ko50mIcZbq
Also Read: కన్నడ బిగ్ బాస్ హౌస్‌కు లైన్ క్లియర్ - డిప్యూటీ సీఎం, అధికారులకు హోస్ట్ కిచ్చా సుదీప్ థాంక్స్
ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచీ భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఈ ప్రాజెక్టుకు 'బెగ్గర్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు గతంలో వార్తలు రాగా ఓ ఇంటర్వ్యూలో అది నిజం కాదని క్లారిటీ ఇచ్చారు విజయ్ సేతుపతి. ఈ సినిమాకు 'స్లమ్ డాగ్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. హాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ 'స్లమ్ డాగ్ మిలియనీర్'ను గుర్తుకు తెచ్చేలా ఈ టైటిల్ ఉందని కచ్చితంగా పూరి మార్క్ స్టైల్ ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మూవీలో విజయ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా... టబు, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరీ కనెక్ట్స్, బేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్స్‌పై పూరీ జగన్నాథ్, చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
విజయ్ రోల్ అదేనా?
ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మూవీని తెరకెక్కిస్తుండగా... విజయ్ పాత్రలో 3 కోణాలుంటాయని టాక్ వినిపిస్తోంది. ఆయన నెగిటివ్ షేడ్‌లో కనిపిస్తారని సమాచారం. 'ఉప్పెన' తర్వాత ఆయన డైరెక్ట్‌గా తెలుగులో చేస్తోన్న రెండో మూవీ. అటు పూరీ జగన్నాథ్‌కు కూడా చాలాకాలంగా సరైన హిట్ పడలేదు. ఈ మూవీతో పూరీ కమ్ బ్యాక్ ఇవ్వాలంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.





















