సంతోష్ శోభన్ (Santosh Shoban) కథానాయకుడిగా ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా 'కపుల్ ఫ్రెండ్లీ' (Couple Friendly Movie)ని రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) చూశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సినిమాను ప్రశంసిస్తూ పోస్ట్ చేశారు. ఇంతకీ ఆయన ఏం పోస్ట్ చేశారు? అనేది చూస్తే... 

'కపుల్ ఫ్రెండ్లీ'కి ప్రభాస్ రివ్యూPrabhas Review For Couple Friendly: తనకు 'వర్షం' తరహాలో సంతోష్ శోభన్‌కు 'కపుల్ ఫ్రెండ్లీ' గుర్తుండిపోయే సినిమా అవుతుందని ప్రభాస్ పేర్కొన్నారు. ''ఇది (కపుల్ ఫ్రెండ్లీ) లవ్ లీ బ్యూటిఫుల్ ఫిల్మ్. నేను సినిమా చూస్తూ ఎంజాయ్ చేశా. సంతోష్ శోభన్, మానసా వారణాసి జంట అద్భుతంగా ఉంది. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ ఎంతో ప్రతిభావంతంగా సినిమాను తెరకెక్కించారు. ఇటువంటి మంచి కథను తెరపైకి తీసుకొచ్చిన సహ నిర్మాత అజయ్, యూవీ క్రియేషన్స్ సంస్థకు కాంగ్రాట్స్'' అని ప్రభాస్ పేర్కొన్నారు.

Also Read: Couple Friendly Movie Review - 'కపుల్ ఫ్రెండ్లీ' రివ్యూ: సంతోష్ శోభన్ సినిమా హిట్టేనా? రొమాంటిక్ డ్రామా ఎలా ఉందంటే?

ప్రభాస్ ప్రశంసలు... గెలిచాననే ఫీలింగ్ - సంతోష్ శోభన్Santosh Shoban reacts to Prabhas post: ప్రభాస్ పోస్ట్ గురించి హీరో సంతోష్ శోభన్ స్పందించారు. సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ''గోకుల్ థియేటర్‌లో ఎన్నో సినిమాలు చూశాను. ఈ రోజు నేను నటించిన సినిమా చూశా. అదీ ప్రేక్షకులు అందరితో. అంత కంటే గొప్ప ఫీలింగ్... మా సినిమాను ప్రభాస్ అన్న చూశారు. ఆయనకు సినిమా బాగా నచ్చింది. 'కపుల్ ఫ్రెండ్లీ' చూసి ప్రశంసించారు. 'నేను గెలిచాను' అనే ఫీల్ వచ్చింది'' అని అన్నారు.

Also Read: Seetha Payanam Review - 'సీతా పయనం' రివ్యూ: విశాఖ to హైదరాబాద్ జర్నీలో లైఫ్ లెసన్స్ - ఐశ్వర్య అర్జున్ సినిమా ఎలా ఉందంటే?

సంతోష్ శోభన్ సరసన మానసా వారణాసి జంటగా నటించిన 'కపుల్ ఫ్రెండ్లీ' చిత్రానికి యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మించింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి అజయ్ కుమార్ రాజు .పి కో ప్రొడ్యూసర్. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ & డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni) ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ సినిమాలో రాజీవ్ కనకాల, గోపరాజు రమణ, యోగి బాబు ఇతర కీలక పాత్రలు చేశారు.

Also Read: Vishwak Sen: ఫ్లాపుల్లోనూ 'ఫంకీ'కి కెరీర్ బెస్ట్ బిజినెస్... విశ్వక్ సేన్‌ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంపేరిజన్ చూస్తే?