Prabhas : ప్రభాస్ ఫేవరెట్ మూవీ ఏంటో తెలుసా? - ఆ స్టార్ డైరెక్టర్‌కు డార్లింగ్ బిగ్ ఫ్యాన్
Prabhas Interview : తనకు ఆల్ టైం ఫేవరెట్ మూవీ 'గీతాంజలి' అని చెప్పారు ప్రభాస్. తాజాగా కపుల్ ఫ్రెండ్లీ టీంతో ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

Prabhas Interaction With Couple Friendly Movie Team : యంగ్ హీరో సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ లవ్ రొమాంటిక్ డ్రామా 'కపుల్ ఫ్రెండ్లీ'. వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా 'కపుల్ ఫ్రెండ్లీ'పై ప్రశంసలు కురిపించారు. తాజాగా మూవీ టీంతో డార్లింగ్ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు ప్రభాస్.
నేను ఆయన ఫ్యాన్
'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ క్లైమాక్స్ వేరే లెవల్‌లో ఉందని ప్రభాస్ ప్రశంసించారు. లాస్ట్ 20 మినిట్స్ సినిమాకే హైలెట్ అని అన్నారు. 'నేను ఏడాదికి 3, 4 సినిమాలు ఫ్యాన్స్ కోసం చేస్తున్నా. కానీ ఒక్కటే రిలీజ్ అవుతుంది. అందరూ నాకు యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం అని అనుకుంటారు. కానీ నాకు అన్ని జానర్లపైనా ఇంట్రెస్ట్ ఉంది. 'గీతాంజలి' మూవీ అంటే చాలా ఇష్టం. డైరెక్టర్ మణిరత్నంకు బిగ్ ఫ్యాన్. కపుల్ ఫ్రెండ్లీ చూస్తుంటే నాకు గీతాంజలి చూస్తున్న ఫీల్ కలిగింది. క్లైమాక్స్ చాలా ఎమోషన్‌గా అనిపించింది. అందుకే నాలుగు సార్లు చూడాలని నిర్ణయించుకున్నా.' అని అన్నారు.
Also Read : అనుపమ క్యూట్ సెల్ఫీ విత్ ధ్రువ్ విక్రమ్ - సమ్‌థింగ్ సమ్‌థింగ్ కన్ఫర్మ్ అంటూ...
అది నా ఫేవరెట్ ఫుడ్
తనకు విజయవాడ పునుగులు అంటే చాలా ఇష్టమని చెప్పారు ప్రభాస్. 'అందరికీ నా ఫుడ్ గురించి తెలుసుకోవాలని ఉంటుంది. విజయవాడ షూటింగ్‌కు వెళ్లినప్పుడు దారిలో పునుగులు తినేవాడిని. అప్పుడప్పుడూ వేరే రాష్ట్రాల నుంచి ఫుడ్ ఆర్డర్ పెడతాను. ముంబయిలో ఆది పురుష్ షూటింగ్ జరిగేటప్పుడు చెన్నై నుంచి ఫుడ్ ఆర్డర్ పెడితే టీం అంతా షాక్ అయ్యారు. ఫ్లైట్‌లో ఆర్డర్ తీసుకొచ్చిన వ్యక్తి మీరు మామూలు వారు కాదండీ అంటూ చెప్పారు.' అని ప్రభాస్ గుర్తు చేసుకున్నారు.
'ఆయనలా ఎవరూ రాయలేదు'
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ 'బుజ్జిగాడు' స్టోరీ చెప్పినప్పుడు తాను ఆశ్చర్యపోయానని అన్నారు ప్రభాస్. 'పూరీ జగన్నాథ్‌లా ఎవరూ రాయలేదు. బుజ్జిగాడులో నా క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకు టెన్షన్ వచ్చింది. పూరీలా ఎవరూ క్యారెక్టరైజేషన్ చేయలేరు. ఆ తర్వాతే 'ఏక్ నిరంజన్' చేశాం. అలాంటి క్యారెక్టర్స్ ఎవరూ రాయలేరు.' అంటూ చెప్పారు.
'లవ్‌లో పడాలని ఉంది'
'మీ దృష్టిలో ప్రేమంటే ఏంటి?' అంటూ హీరోయిన్ మానసా వారణాసి ప్రభాస్‌ను అడగ్గా... పర్సనల్ క్వశ్చన్ అంటూ నవ్వులు పూయించారు. 'నాకు లవ్ అనగానే 'కపుల్ ఫ్రెండ్లీ' గుర్తొస్తుంది. ఈ సినిమా చూశాక నాకు లవ్‌లో పడాలని ఉంది.' అంటూ చెప్పారు. ఆ తర్వాత హీరో సంతోష్ ఆయన్ను ఫోన్ నెంబర్ అడగ్గా... ఇచ్చారు. ఇంపార్టెంట్ అయితే తప్ప ఫోన్ చెయ్యొద్దంటూ సరదాగా కామెంట్స్ చేశారు.
Rebel Star #Prabhas in DARLING MODE 🫶😍
— UV Creations (@UV_Creations) February 20, 2026
DARLING TALKS with the blockbuster team of #CoupleFriendly out now ❤️
▶️ https://t.co/wXOiKx8EyO
The BLOCKBUSTER LOVE STORY OF THE SEASON running successfully in theatres ❤️
Book your tickets now!
🎟️ https://t.co/fPvjbAKduF… pic.twitter.com/xMNj2WUeOr
























