Prabhas : జపాన్‌లో 'బాహుబలి' - ఫ్యాన్స్‌తో ప్రభాస్ క్యూట్ మూమెంట్స్... తెలుగు డైలాగ్‌తో జోష్ పెంచిన డార్లింగ్
Prabhas Japanese Fans : డార్లింగ్ ప్రభాస్ జపాన్‌లో సందడి చేశారు. 'బాహుబలి ది ఎపిక్' స్పెషల్ స్క్రీనింగ్‌లో ఆయన జపనీస్ అభిమానులను కలిసి ముచ్చటించారు.

Prabhas Meets Fans In Japan Baahubali The Epic Special Screening : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జపాన్‌లో అభిమానులను కలిశారు. 'బాహుబలి ది ఎపిక్' ఈ నెల 12న అక్కడ రిలీజ్ కానున్న నేపథ్యంలో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. ఈ క్రమంలో మూవీ తర్వాత ప్రభాస్ అక్కడి అభిమానులను కలిసి ముచ్చటించారు.
బాహుబలి జయహో
జపాన్‌లో డార్లింగ్ ప్రభాస్‌కు ఘన స్వాగతం లభించింది. 'బాహుబలి జయహో' అంటూ ఆయనకు జపనీస్ అభిమానులు బ్రహ్మ రథం పట్టారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడ్డారు. ఈ సందర్భంగా జపనీస్ భాషలో బాహుబలి క్యారెక్టర్స్, బొమ్మలతో ఏర్పాటు చేసిన బోర్డులను చూసి ప్రభాస్ ఆశ్చర్యపోయారు. అందరికీ అభివాదం చెబుతూ కూల్‌గా కనిపించిన ప్రభాస్ యాటిట్యూడ్‌కు అక్కడి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ఈ సందర్భంగా సినిమాలో ఓ డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నారు ప్రభాస్. 'ఆడవారి ఒంటి మీద నరకాల్సింది వేలు కాదు తల' అంటూ చెప్పగా ఫ్యాన్స్ సందడి చేశారు. ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Baahubali The Eternal War
— OK Media Updates (@OkmediaUpdates) December 5, 2025
#BaahubaliTheEpicInJapan #Prabhas #BaahubaliTheEternalWar #Baahubali pic.twitter.com/35KH6Del9k
Baahubali jaiho
— Mahi💛 (@Thalapaglu_7) December 5, 2025
Baahubali jaiho..#BaahubaliTheEpic#Prabhas #Japan pic.twitter.com/ODlqJ4tKPI
A beautiful, light pink glow is clearly visible on #Prabhas's face;
— Priti Prabhas 🇮🇳 (@PritiPreeti3) December 5, 2025
My Darling is blushing...🥰😘❤️❤️ pic.twitter.com/aAynTchUck
AMARENDRA BAAHUBALI IN JAPAN!!#Prabhas #Baahubali #BaahubaliTheEpic pic.twitter.com/J3EUVpKHCP
— Baahubali (@BaahubaliMovie) December 5, 2025
Our Darling #Prabhas is currently in Japan for Baahubali The Epic's Special Screening 🕺🔥 pic.twitter.com/P378MCOJDZ
— Prabhas FC (@PrabhasRaju) December 5, 2025
బాహుబలి 1, 2 రెండు పార్టులను కలిపి 'బాహుబలి ది ఎపిక్'గా అక్టోబర్ 31న మేకర్స్ రిలీజ్ చేశారు. కొన్ని అనవసర సీన్స్ కట్ చేసి ఒకే మూవీగా తీసుకురాగా... అప్పట్లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ తిరగరాసింది. ఇప్పుడు కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ క్రేజ్ దృష్ట్యా జపాన్‌లో ఈ నెల 12న మూవీ రిలీజ్ కానుంది. అక్కడి అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : బాలయ్యకు జరిగింది అవమానమా? అన్యాయమా? 'అఖండ 2' వాయిదాపై ఫ్యాన్స్ ఫీలింగ్ ఏమిటి?
ఇక సినిమాల విషయానికొస్తే ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ మూవీలో తృప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీలో లుక్ లీక్ కాకుండా సందీప్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే, మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరగనున్నట్లు తెలుస్తోంది.























