Prabhas Hanu Raghavapudi Movie Fauji Poster Decoding: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు 'ఫౌజీ' టైటిల్ ఖరారు చేశారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా గురువారం (అక్టోబర్ 23న) టైటిల్ రివీల్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఒక ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఆ పోస్టర్ చూశారా? నిశితంగా గమనిస్తే ఏం అర్థం అవుతుందో తెలుసా?
అతనే సైన్యం... నడిచే యుద్ధం!a battalion who walks alone - ఇదీ ప్రభాస్ - హను ప్రీ లుక్ పోస్టర్ మీద రాసిన లైన్. బెటాలియన్ అంటే మిలటరీ యూనిట్. హీరోని బెటాలియన్ అని చెప్పడం ద్వారా అతనే ఒక మిలటరీ యూనిట్ అని చెబుతున్నారు. బెటాలియన్ నడవడం అంటే యుద్ధం చేయడం. ఆ లైన్ ద్వారా హీరోని నడిచే యుద్ధంగా పేర్కొన్నారు.
మోస్ట్ వాంటెడ్... అదీ 1932 నుంచి!ప్రీ లుక్ పోస్టర్ మీద 'most wanted since 1932' అని రాశారు. 1932 నుంచి అతను మోస్ట్ వాంటెడ్ అన్నారు. అంటే... మన భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు జరిగే కథ అని స్పష్టం అవుతోంది. భారత స్వాతంత్య్రం కోసం పలువురు యోధులు పోరాటం చేశారు. మొదట బ్రిటిష్ మిలటరీలో చేరినా... తర్వాత వాళ్లకు ఎదురు తిరిగిన భారతీయులు ఉన్నారు. ఉదాహరణకు... 'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్ క్యారెక్టర్ టైపులో!
రెండో ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు జరిగింది. 'ఫౌజీ'లో మరి ఆ వరల్డ్ వార్ 2 ప్రస్తావన ఏమైనా ఉంటుందేమో చూడాలి. అయితే... 1932లో ఏం జరిగింది? అనేది సస్పెన్స్.
అసలు 'Z' అంటే ఏంటి? సస్పెన్స్!ప్రభాస్ - హను మూవీ నుంచి ఇప్పటి వరకు విడుదలైన రెండు పోస్టర్స్ మీద 'Z' అక్షరాన్ని హైలైట్ చేశారు. దానికి కథతో సంబంధం ఉండొచ్చు. హీరో చేసే మిషన్ పేరు 'Z' కావచ్చు. ఇక పోస్టర్ మీద నడిచేది హీరో అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదుగా!
అఖండ భారతంలో జరిగే 'ఫౌజీ'...కథానాయకుడిలో అర్జునుడి లక్షణాలు!ఒక్కటి మాత్రం క్లియర్... అఖండ భారతంగా 'ఫౌజీ' కథ జరుగుతుంది. పోస్టర్ మీద కొన్ని సంస్కృత వ్యాఖ్యలు సైతం రాశారు. పద్మవ్యూహాన్ని చేధించిన పార్థ అని పేర్కొంటున్నారు. మహాభారతంలో అర్జునుడిని పార్థ అంటారు. అంటే... కదన రంగంలో కథానాయకుడిని అర్జునుడితో పోల్చారు.
Also Read: బాక్సాఫీస్ బాహుబలి... అప్ కమింగ్ మూవీస్ @ 4000 కోట్లు - ఎవ్వరికీ అందనంత ఎత్తులో ప్రభాస్
మిలటరీ నేపథ్యంలో దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమా తీస్తున్నారని అర్థం అవుతోంది. ఇదొక ప్రేమ కథ అని విశ్వసనీయ వర్గాల సమాచారం. కథలో హీరోకి తగ్గట్టు యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయట. పోస్టర్ చూస్తే స్పై థ్రిల్లర్ అని చాలా మంది భావిస్తున్నారు. ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ ఇతర తారాగణం.