Prabhas's Fauzi Release Date Locked : డార్లింగ్ ఫ్యాన్స్‌కు నిజంగా ఇది గుడ్ న్యూసే. ప్రభాస్ (Prabhas), సీతారామం ఫేం హను రాఘవపూడి కాంబో అవెయిటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
'ఫౌజీ'ని (Fauzi) వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 3న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. రీసెంట్‌గా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పెద్దలు మూవీ షూటింగ్‌పై బిగ్ అప్డేట్ ఇచ్చారు. దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తైందని... ప్రభాస్‌పై షూట్ చేయాల్సిన యాక్షన్ సీక్వెన్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పారు. ఈ క్రమంలో తాజా డేట్ వైరల్ అవుతుండగా... దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. అదే రోజున మూవీ రిలీజ్ కన్ఫర్మ్ అయితే... ఇప్పటి నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని ఫ్యాన్స్ అంటున్నారు.
'ది రాజా సాబ్' రిజల్ట్ తర్వాత డార్లింగ్ ఫ్యాన్స్‌లో కొంత నిరాశ ఉంది. బాక్సాఫీస్‌ను షేక్ చేసే బిగ్ హిట్ ప్రభాస్ ఖాతాలో పడాలని బలంగా కోరుకుంటున్నారు. 'కల్కి' తర్వాత అంతటి స్థాయిలో సరైన హిట్ పడలేదు. 'ఫౌజీ' టైటిల్ గ్లింప్స్ తర్వాత మూవీ నుంచి అఫీషియల్‌గా ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. దీంతో ఈలోపే ఏదైనా సర్ప్రైజ్ ఉంటే బాగుంటుందని... క్రేజ్ ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.
ఫౌజీ స్టోరీ ఏంటి?
టైటిల్, ప్రీ లుక్ పోస్టర్‌తోనే ఫౌజీ స్టోరీపై డైరెక్టర్ హను రాఘవపూడి హింట్ ఇచ్చారు. స్వాతంత్ర్యానికి ముందు 1930 నుంచి జరిగిన సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ ఓ బెటాలియన్ నాయకుడిగా, పవర్ ఫుల్ సైనికుడిగా కనిపించనున్నారు. తనకు ఇన్ స్పైర్ కలిగించిన కొన్ని ఘటనల ఆధారంగా 'ఫౌజీ' తెరకెక్కించనున్నట్లు చెప్పారు డైరెక్టర్ హను. సెకండ్ వరల్డ్ వార్ టైంలో పద్మవ్యూహాన్ని ఛేదించే అర్జునుడిలా ఓ వారియర్‌లా ప్రభాస్‌ను చూడొచ్చని పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాతో స్పై థ్రిల్లర్ జానర్ టచ్ కూడా ఉంటుందని భావిస్తున్నారు.
సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే, అనుపమ్ ఖేర్, భాను చందర్, మిథున్ చక్రవర్తి, జయప్రద తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ దాదాపు రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నారు.
Also Read : Idupu Kayitham Controversy : టైటిల్ మార్చే ప్రసక్తే లేదు - ఇడుపు కాయితం కాంట్రవర్సీపై బన్నీ వాస్ రియాక్షన్
