ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, మన బాహుబలి ప్రభాస్ తన కొత్త చిత్రం 'ది రాజా సాబ్'తో వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు సినిమా విడుదల సమయం దగ్గర పడిన తరుణంలో... ప్రభాస్ డేటింగ్ వార్తలు కూడా మొదలు అయ్యాయి. ఆయన తన కొత్త సినిమాలో హీరోయిన్ రిద్ధి కుమార్‌ (Riddhi Kumar)తో డేటింగ్ చేస్తున్నారని అంటున్నారు. వీరిద్దరూ 'ది రాజా సాబ్' సినిమాలో కలిసి నటించారు. రిద్ధి, ప్రభాస్‌తో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు ఆమె చేప్పిన ఒక మాటతో మొదలు అయ్యాయి. అందులో ప్రభాస్ నుండి తాను చీరను బహుమతిగా అందుకున్నట్లు వెల్లడించింది.

Continues below advertisement

ప్రభాస్ ఇచ్చిన ప్రత్యేక బహుమతినిజానికి 'ది రాజా సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రిద్ధి కుమార్ చెప్పిన ఒక మాట వల్లే ప్రభాస్‌తో ఆమె డేటింగ్ వ్యవహారం గురించి వార్తలు వస్తున్నాయి. ప్రభాస్‌ను 'ది రాజా సాబ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రిద్ధి తెగ పొగిడింది. అంతే కాకుండా, ప్రభాస్ నుండి తనకు లభించిన చీర గురించి కూడా ప్రస్తావించింది. రిద్ధి మాట్లాడుతూ, ''రాజా సాబ్ సినిమా పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుంది. మారుతి గారు, మన డార్లింగ్ (ప్రభాస్) ను ఆయనలా చూపించినందుకు ధన్యవాదాలు. ప్రభాస్, మీకు థ్యాంక్స్‌. నేను ఇక్కడ ఉన్నానంటే మీ వల్లే. మీరు నన్ను ఈ సినిమాలో తీసుకున్నారు. మీరు ఇచ్చిన చీరనే నేను కట్టుకున్నాను. దీన్ని నేను 3 సంవత్సరాలు దాచుకున్నాను. ఈ రోజు ధరించడానికి జాగ్రత్తగా ఉంచుకున్నాను. నా జీవితంలో మిమ్మల్ని పొందడం నాకు సంతోషంగా ఉంది'' అని చెప్పింది.

ఇప్పుడు రిద్ధి కుమార్ మట్లాడిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆమెతో ప్రభాస్ రహస్యంగా డేటింగ్ చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు. ప్రభాస్ కంటే వయసులో రిద్ధి కుమార్ 19 సంవత్సరాలు చిన్నది. ఇంతకు ముందు కూడా ప్రభాస్ పేరు పలువురు హీరోయిన్లతో డేటింగ్ రూమర్లలో ముడి పడింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... 'ది రాజా సాబ్' కంటే ముందు ప్రభాస్ రొమాంటిక్ డ్రామా చిత్రం 'రాధే శ్యామ్' (2022)లో రిద్ధి కుమార్ నటించారు. 'ది రాజా సాబ్' విషయానికి వస్తే, ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు సంజయ్ దత్, బొమన్ ఇరానీ, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఇది ఒక హారర్ కామెడీ. జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది.