Pournami Re Release: పౌర్ణమి రీ రిలీజ్... సెప్టెంబర్‌లో థియేటర్లలోకి - డేట్ అనౌన్స్ చేశారోచ్
Pournami Re Release Date: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. 'ది రాజా సాబ్', 'బాహుబలి: ది ఎపిక్' కంటే ముందు 'పౌర్ణమి' థియేటర్లలో సందడి చేయనుంది.

Prabhas Pournami Re Release Date 2025: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. యాక్షన్ ప్యాక్డ్ సినిమాలలో చూస్తున్న ఆయనను వెండితెరపై మరోసారి మంచి ప్రేమ కథలో చూసే అవకాశం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆయన కల్టి క్లాసిక్ ఫిలిమ్స్‌లో ఒకటైన పౌర్ణమి రీ రిలీజ్ కాబోతోంది.
సెప్టెంబర్‌లో థియేటర్లలోకి పౌర్ణమి!
ప్రభాస్ ఫ్యాన్స్ అంతా 'ది రాజా సాబ్' విడుదల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. బాహుబలి ది బిగినింగ్ విడుదలై 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో 'బాహుబలి: ది ఎపిక్' విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Also Read: 'కింగ్‌డమ్'కు సందీప్ రెడ్డి వంగా రివ్యూ... విజయ్ దేవరకొండ సినిమాపై ఆయన రిపోర్ట్ ఏమిటంటే?
డిసెంబర్ 5న థియేటర్లలోకి 'ది రాజా సాబ్' రానున్న సంగతి ఫ్యాన్స్, ఆడియన్స్ అందరికీ తెలుసు. ఆ సినిమా కంటే ముందు అక్టోబర్ 31న థియేటర్లలోకి 'బాహుబలి: ది ఎపిక్' రానుంది. ఆ సినిమా కంటే ముందు పౌర్ణమి థియేటర్లలో సందడి చేయనుంది. సెప్టెంబర్ 19న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయనున్నారు. అందుకు సినిమాను 4కే క్వాలిటీలోకి కన్వర్ట్ చేశారు. టెక్నాలజీ పరంగా అప్డేట్ చేశారు.
#Pournami4K Re-Releasing In Theatres Again On September 19th 🔱❤️🔥
— Suresh PRO (@SureshPRO_) July 26, 2025
Step into the world of ULTRA-HIGH definition 💥
Rebel Star #Prabhas pic.twitter.com/xVZObVSEWB
ప్రభాస్ జంటగా త్రిష... ఛార్మి!
ప్రభాస్, త్రిషలది సూపర్ డూపర్ హిట్ జోడి. 'వర్షం'లో వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీకి, నటనకు ఎంతో మంది ఫాన్స్ ఉన్నారు. అటువంటి హిట్ సినిమా తర్వాత ప్రభాస్, త్రిష మళ్లీ జంటగా నటించిన సినిమా 'పౌర్ణమి'. ఇందులో ఛార్మి కౌర్ సెకండ్ లీడ్ రోల్ చేశారు.
ప్రభుదేవా దర్శకత్వం వహించిన 'పౌర్ణమి' చిత్రాన్ని హిట్ సినిమాల రారాజు - సుమంత్ ఆర్ట్స్ అధినేత ఎమ్మెస్ రాజు ప్రొడ్యూస్ చేశారు. థియేటర్లలో విడుదలైన సమయంలో మిశ్రమ స్పందన లభించింది. అయితే విడుదలైన కొన్నాళ్లకు ఈ సినిమా కల్ట్ క్లాస్ స్టేటస్ అందుకుంది. ఇప్పుడు మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధం అయ్యింది. ఈ మధ్య రీ రిలీజ్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. అందువల్ల పౌర్ణమి సైతం భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది.
Also Read: 'స్పిరిట్' అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా... షూట్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?





















