Kamakshi Bhaskarla: అందమైన అమ్మాయిలు మలవిసర్జన చేస్తారా? పిచ్చి ప్రశ్నకు పొలిమేర హీరోయిన్ సమాధానం చూశారా?
Polimera Actress Kamakshi Bhaskarla Latest News: 'పొలిమేర' సిరీస్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక, తెలుగు అమ్మాయి కామాక్షి భాస్కర్ల. ఆవిడకు ఎదురైన పిచ్చి ప్రశ్నకు ఏం సమాధానం చెప్పారో తెలుసా?

'పొలిమేర'తో హీరోయిన్‌గా కామాక్షి భాస్కర్ల తన నటనతో అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత కామాక్షి పలు చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చి విజయాల్ని అందుకుంది. అయితే నటిగానే కాకుండా కామాక్షి భాస్కర్ల డాక్టర్‌గానూ బిజీగా ఉంటుంది. డాక్టర్ కమ్ యాక్టర్ అయిన ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్, ఫాలోయింగ్ ఉంటుంది. ఇక ఈ అమ్మడు షేర్ చేసే బోల్డ్ ఫోటోలకు యువత ఫిదా అవుతుంటారు. ఈ క్రమంలో కామాక్షికి కొన్ని వింత వింత ప్రశ్నలు కూడా ఎదురవుతూ ఉంటాయి.
బ్యూటీ విత్ బ్రెయిన్ అన్నట్టుగా కామాక్షి ఆ పిచ్చి ప్రశ్నలకు సెటైరికల్‌గా సమాధానం ఇస్తుంటుంది. రీసెంట్‌గా ఓ నెటిజన్ మీకు ఇష్టమైన పొజిషన్ ఏంటి? అని కాస్త వెటకారంగా అడిగాడు. ఆ ప్రశ్నకు కామాక్షి ఎంతో హుందాగా సమాధానం ఇచ్చింది. ఇక ఇప్పుడు మరో పిచ్చి ప్రశ్నను నెటిజన్ అడిగాడు. అతడికి కూడా అలానే గడ్డి పెట్టింది. నవ్వుతూనే సెటైర్ వేసింది. అతను వేసిన ప్రశ్నే చాలా అసహ్యంగా ఉంది. కానీ కామాక్షి మాత్రం ఎంతో సమయస్పూర్తితో సమాధానం ఇచ్చింది.
'అందమైన అమ్మాయిలు మలవిసర్జన చేస్తారా? నిజాయితీగా సమాధానం చెప్పండి?' అని అడిగాడు. ఆ ప్రశ్న చూసి కామాక్షి ఒకింత ఆశ్చర్యానికి గురైనట్టుగా కనిపించింది. కానీ అతడికి తన స్టైల్లో సమాధానం ఇచ్చింది. ''డాక్టర్, యాక్టర్ అయిన నేనే ఈ ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పగలను. ఆనర్స్ ఈజ్ నో. మేమంతా కూడా కాంక్రీట్, సిమెంట్‌తో తయారయ్యాం. అందుకే రాదు.. మాయం అవుతుంది.. దాంతో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాం'' అని ఆన్సర్ ఇచ్చింది.
View this post on Instagram
''అలా వచ్చిన దానితోనే వ్యవసాయం చేస్తాం.. దాన్నే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం.. అదే మళ్లీ నువ్వు తింటావు'' అని చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం ఇచ్చింది. ఈ దెబ్బకు ఇంకోసారి ఇలాంటి పిచ్చి ప్రశ్నల్ని సంధించకుండా అయిపోయాడు. ఇక కామాక్షి చివరగా విశ్వక్ సేన్ 'లైలా' చిత్రంలో కనిపించింది. మళ్లీ పొలిమేర మూడో పార్టుతో కామాక్షి ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. ఇక కామాక్షికి మాత్రం హీరోయిన్‌గా ఇంకా సరైన బ్రేక్ రాలేదు. సోషల్ మీడియాలో ఉన్నంత ఫాలోయింగ్, డిమాండ్ తెరపై కనిపించడం లేదు.
Also Read: ఓటీటీలోకి వచ్చిన 375 కోట్ల సినిమా... స్ట్రీమింగ్ ఎందులో, ఎన్ని భాషల్లోనో తెలుసా?























