అన్వేషించండి

Virosh Wedding: విరోష్ పెళ్లికి ప్రధాని మోడీ అభినందనలు... లెటర్ రిలీజ్ చేసిన పీఎంవో

The Wedding Of Virosh: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి ఫిబ్రవరి 26న జరుగుతోంది. ఈ పెళ్లికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించారు. కొత్త జంటకు మోడీ అభినందలు తెలిపారు.

ది రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) మరికొన్ని గంటల్లో ఓ ఇంటివాడు కాబోతున్నారు. దేవరకొండ ఇంటి కోడలు కాబోతున్నారు నేషనల్ క్రష్ రష్మికా మందన్నా (Rashmika Mandanna). తమ పెళ్ళికి వీళ్ళిద్దరూ 'ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్' (The Wedding Of Virosh) అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. 

విరోష్ పెళ్లికి ప్రధాని మోడీ అభినందనలు
విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లికి ఉదయ్ పూర్ వేదిక అయిన సంగతి తెలిసిందే. రేపు (ఫిబ్రవరి 26, 2026న) ఏడు అడుగులు వేయనున్నారు. ఈ వివాహానికి ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)ని ఆహ్వానించారు. ఈ తరుణంలో కాబోయే కొత్త జంటకు ఆయన శుభాభినందనలు తెలిపారు. 

''విజయ్, రష్మిక వివాహానికి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఈ అత్యంత ఆనందకరమైన, శుభ సందర్భంలో దేవరకొండ, మందన్న... రెండు కుటుంబాలకు నా హృదయపూర్వక అభినందనలు, అలాగే శుభాకాంక్షలు. విజయ్, రష్మిక జీవితాల్లో అందమైన సరికొత్త అధ్యాయానికి ఈ పెళ్లి నాంది పలుకుతుంది. 'సఖా సప్తపదా భవ' అంటే ఏడు అడుగులు కలిసి నడిచి, జీవితాంతం స్నేహితులుగా ఉండాలనే స్ఫూర్తితో ఈ జంట ఒకటి కాబోతోంది'' అని ప్రధాని మోడీ లేఖలో పేర్కొన్నారు.

Also ReadBalakrishna - Venkatesh: బాలయ్య vs వెంకీ... రెండు సినిమాల కథ ఒక్కటే, రిలీజ్ డే కూడా... బాక్సాఫీస్‌లో హిట్టు కొట్టిందెవరు?

విజయ్, రష్మిక పలు సినిమాలు చేశారని, వెండితెరపై వాళ్లిద్దరూ కొత్త ఏమీ కాదని... వ్యక్తిగతంగానూ ప్రేమ, అనురాగాలతో నిండిన జీవితం ఉంటుందని, వెండితెరపై వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కంటే వ్యక్తిగత జీవితం గొప్పగా ఉంటుందని మోడీ పేర్కొన్నారు. విజయ్, రష్మిక కన్న కలలు నెరవేరాలని ఆయన ఆకాంక్షించారు. ఆలోచనాత్మక, ప్రేమ పూర్వక బాధ్యతలను పంచుకుంటూ.... ఒకరి అసంపూర్ణతలను మరొకరు స్వీకరిస్తూ... ఒకరి బలాల నుంచి మరొకరు నేర్చుకుంటూ భాగస్వాములుగా జీవిత ప్రయాణాన్ని సాగించాలని దీవించారు మోడీ. నూతన దంపతులకు ఆశీస్సులు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

Also ReadNTR - Ravi Teja: ర‌వితేజతో అనౌన్స్ చేశారు... ఎన్టీఆర్‌తో సినిమా చేశారు... కెరీర్ టర్నింగ్ పాయింట్ సినిమా బ్యాక్‌స్టోరీ తెలుసా?

ఉదయ్ పూర్ వేదికగా జరగనున్న విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లికి కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది బంధు మిత్రులు హాజరు కానున్నారు. మార్చి 4న హైదరాబాద్ వేదికగా జరగబోయే రిసెప్షన్ వేడుకకు చిత్రసీమ ప్రముఖులు హాజరు కానున్నారు.

Also ReadKiran Abbavaram: కిరణ్ అబ్బవరం వెబ్ సిరీస్ టైటిల్ ఫిక్స్... కడప నేపథ్యంలో!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rajasekhar : గోటీల ఫ్యాక్టరీతో 3 కోట్ల ఆదాయం - హీరో రాజశేఖర్ ఫస్ట్ రియాక్షన్
గోటీల ఫ్యాక్టరీతో 3 కోట్ల ఆదాయం - హీరో రాజశేఖర్ ఫస్ట్ రియాక్షన్
Oscars 2026: ఆస్కార్ 2026... భారత్‌లో ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చు? ప్రియాంక చోప్రా స్పెషల్ అట్రాక్షన్!
ఆస్కార్ 2026... భారత్‌లో ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చు? ప్రియాంక చోప్రా స్పెషల్ అట్రాక్షన్!
MANN PISHACH Trailer : 33 వేల బడ్జెట్... 80 నిమిషాల రన్ టైం - తుంబాడ్ డైరెక్టర్ సైకలాజికల్ హారర్ డ్రామా మన్ పిశాచ్... ట్రైలర్ చూశారా?
33 వేల బడ్జెట్... 80 నిమిషాల రన్ టైం - తుంబాడ్ డైరెక్టర్ సైకలాజికల్ హారర్ డ్రామా మన్ పిశాచ్... ట్రైలర్ చూశారా?
Hebah Patel: హెబ్బా పటేల్‌కు మరో ఆఫర్... ఈసారి 'దర్జా'గా హిట్ కొట్టాలని!
హెబ్బా పటేల్‌కు మరో ఆఫర్... ఈసారి 'దర్జా'గా హిట్ కొట్టాలని!
Advertisement

వీడియోలు

Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anakalapalle Latest News:
"మా ఫుడ్‌తో పిండివంటలు చేసుకుంటున్నార్‌ సార్" బీసీ హాస్టల్‌ దుస్థితిపై లోకేష్‌కు విద్యార్థుల ఫిర్యాదు! ప్రభుత్వం సీరియస్
Srikakulam Latest News: ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!
ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!
Sonam Wangchuk: సోనమ్‌వాంగ్ చుక్‌కు కేంద్రం గుడ్ న్యూస్ - నిర్బంధం ఎత్తివేయాలని నిర్ణయం
సోనమ్‌వాంగ్ చుక్‌కు కేంద్రం గుడ్ న్యూస్ - నిర్బంధం ఎత్తివేయాలని నిర్ణయం
Kakinada Latest News:కాకినాడ జిల్లాలో పులి కలకలం: మన్యం ఊళ్లలో గుబులు- బయటకు రావాలంటే వణుకుతున్న జనం!
కాకినాడ జిల్లాలో పులి కలకలం: మన్యం ఊళ్లలో గుబులు- బయటకు రావాలంటే వణుకుతున్న జనం!
Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!
Ram Gopal Varma : అమితాబ్ 'సర్కార్ 4'పై బిగ్ అప్డేట్ - ఆ సినిమా నా పాపాలన్నీ కడిగేస్తుంది... రామ్ గోపాల్ వర్మ
అమితాబ్ 'సర్కార్ 4'పై బిగ్ అప్డేట్ - ఆ సినిమా నా పాపాలన్నీ కడిగేస్తుంది... రామ్ గోపాల్ వర్మ
Raghav Chadha On Menstrual Health: మందు, సిగరెట్‌కు లేని సిగ్గు శానిటరీ ప్యాడ్స్‌కు ఎందుకు? పార్లమెంట్‌లో గళమెత్తిన రాఘవ్‌ చద్దా!
మందు, సిగరెట్‌కు లేని సిగ్గు శానిటరీ ప్యాడ్స్‌కు ఎందుకు? పార్లమెంట్‌లో గళమెత్తిన రాఘవ్‌ చద్దా!
Sampradayini Suppini Suddapoosani OTT : ఓటీటీలోకి సాంప్రదాయనీ సుప్పినీ సుద్దపూసనీ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సాంప్రదాయనీ సుప్పినీ సుద్దపూసనీ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Embed widget