Raju Gari Gadhi 4 Officially Announced: యాంకర్ ఓంకార్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీ 'రాజు గారి గది'. తన సోదరుడు అశ్విన్ బాబు హీరోగా రూపొందించిన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన పార్ట్ 2, పార్ట్ 3 అనుకున్నంత సక్సెస్ కాలేకపోయాయి. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేశారు.
'మిరాయ్' వంటి బిగ్ సక్సెస్ తర్వాత ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' బ్యానర్‌లో 'రాజు గారి గది 4: శ్రీచక్రం' అనౌన్స్ చేశారు. ఈ మూవీకి ఓంకార్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుండగా... తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
కాళికా దేవి బ్యాక్ డ్రాప్‌గా...
ఈసారి కాళికా దేవి బ్యాక్ డ్రాప్‌గా మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. కాళికా మాత ఉగ్ర రూపం ప్రత్యక్షం కాగా... ఎర్ర చీర కట్టుకున్న ఓ మహిళ అమ్మవారి వైపు వెళ్తున్నట్లుగా ఉన్న పోస్టర్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. అమ్మవారు, శ్రీచక్రం ప్రధానాంశంగా స్టోరీ రూపొందించినట్లు పోస్టర్‌ను బట్టి అర్థమవుతోంది. 'కాళికాపురం' అనే ఊరిలో ఉండే కాళికా మాత ఆలయం, శ్రీచక్రం మహిమలతో పాటు హారర్, థ్రిల్లర్, కామెడీ ప్రాధాన్యంగా మూవీని తెరకెక్కించనున్నారు.
'ఎ డివైన్ హారర్ బిగిన్స్' అనే ట్యాగ్ లైన్ ఇవ్వగా... సస్పెన్స్, ఆకర్షణీయమైన కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది 'రాజు గారి గది 4: శ్రీచక్రం'. 'భక్తి విరగ్గానే ఆమె కోపం మేల్కొంటుంది. ఈ శుభ విజయ దశమి రోజున తెలుగు సినిమాను కుదిపేసిన భయానక గాథ తిరిగి వచ్చింది. 'రాజు గారి గది 4 - శ్రీచక్రం' షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది. భయం త్వరగా స్టార్ట్ అవుతుంది.' అంటూ రాసుకొచ్చారు మేకర్స్. 2026, దసరాకు మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
హారర్ థ్రిల్లర్స్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ జానర్‌లోనే వచ్చిన ఫస్ట్ మూవీ 'రాజు గారి గది' మంచి విజయం సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2017లో వచ్చిన రాజు గారి గది 2, 2019లో వచ్చిన మూడో పార్ట్ అనుకున్నంత సక్సెస్ కాలేదు. దాని తర్వాత డైరెక్టర్ ఓంకార్ గ్యాప్ తీసుకున్నారు. దాదాపు ఆరేళ్ల తర్వాత 'రాజు గారి గది 4' అనౌన్స్ చేశారు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో దీన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
Raju Gari Gadhi 4 Cast And Crew: బ్యానర్ - పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ప్రొడ్యూసర్స్ - టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్, డైరెక్టర్ - ఓంకార్, మ్యూజిక్ డైరెక్టర్ - తమన్, DOP - సమీర్ రెడ్డి, ఎడిటర్ - తమ్మిరాజు, ప్రొడక్షన్ డిజైనర్ - శ్రీనాగేంద్ర తంగల, డైలాగ్స్ - అజ్జు మహాకాళి.