Ram Charan's Peddi Special Hallallallo Song Out : 'హల్లల్లల్లో... హల్లో హల్లల్లల్లో హల్లల్లో...' శనివారం నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పెద్ది సాంగ్ ప్రోమో. తాజాగా ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది. భోపాల్‌లో స్పెషల్ ఈవెంట్ నిర్వహించి సాంగ్ రిలీజ్ చేస్తారని భావించినా... కేవలం ఆడియో సాంగ్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇప్పుడు ఫుల్ సాంగ్‌తో ఫ్యాన్స్ ఫుల్ జోష్ ఇచ్చారు.
సాంగ్ ఎలా ఉందంటే?
'హల్లల్లల్లో... హల్లో హల్లల్లల్లో హల్లల్లో... బావ చీర చొక్కా చిక్కడిపోవాలో...' అంటూ రొమాంటిక్ టచ్ ఇచ్చేలా సాగే లిరిక్స్ యూత్‌ను ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటే చరణ్, శ్రుతి హాసన్, జాన్వీ స్టెప్పులు మరింత జోష్ పెంచేస్తున్నాయి. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా... రక్షిత సురేష్ పాడారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. మాస్ లుక్‌లో చరణ్ అదరగొట్టగా... ప్రస్తుతం ఈ రొమాంటిక్ సాంగ్ ట్రెండ్ అవుతోంది.
Also Read : పెద్ది నా కెరీర్‌లోనే నెం.1 మూవీ - హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీ... స్పెషల్ సాంగ్ ఈవెంట్‌లో రామ్ చరణ్
చికిరి చికిరి, రయ్ రయ్ రా రా సాంగ్స్ దగ్గర నుంచీ ట్రైలర్ వరకూ పెద్ది నుంచి అన్నీ సర్ప్రైజ్ చేశాయి. మూవీలో క్లైమాక్స్ అతి పెద్ద సర్ప్రైజ్ అని మొదటి నుంచి మూవీ టీం చెబుతూ వస్తోంది. 'ఉప్పెన'ను మించి 100 రెట్లు ఈ క్లైమాక్స్ ఉంటుందని రామ్ చరణ్ ఇది వరకే రివ్యూ ఇచ్చారు. దీంతో హైప్ పదింతలు అవుతుంది. జూన్ 4న సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ప్రమోషన్స్ విషయంలోనూ మూవీ టీం దేశవ్యాప్తంగా హైప్ ఇస్తోంది. ఆదివారం బెంగుళూరులో, 28న ఢిల్లీలో, 30న చెన్నైలో, జూన్ 1న విజయనగరం, జూన్ 2న హైదరాబాద్‌లో స్పెషల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. భాగ్యనగరంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య చీఫ్ గెస్ట్‌గా వస్తారనే ప్రచారం సాగుతోంది.
Also Read : అద్దం ముందు అందాల మౌనీరాయ్ - దేవకన్యలా బాలీవుడ్ బ్యూటీ
సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా... కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతిబాబు, సాయి కుమార్, అజయ్ ఘోష్, రంగస్థలం మహేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. జూన్ 4న వరల్డ్ వైడ్‌గా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. జూన్ 3న ప్రీమియర్స్ వేయనున్నారు.
