'పెద్ది' సినిమా బాక్సాఫీస్ బరిలో బాగా రాణిస్తోంది. ఈ సినిమా రెండు రోజుల్లో 150 కోట్లు కలెక్ట్ చేసింది.
Buchi Babu Sana: జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
Buchi Babu Sana On Jahnavi Kapoor Role: 'పెద్ది'లో హీరోయిన్ జాన్వీ కపూర్ రోల్ మీద విమర్శలు వచ్చాయి. వాటిపై దర్శకుడు బుచ్చిబాబు సానా స్పందించారు. ఆయన ఏమన్నారంటే?

- రామ్ చరణ్ 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద 150 కోట్లు వసూలు చేసింది.
- జాన్వీ పాత్రను శృంగారంగా చూపించడం, ముద్దు సన్నివేశాలపై విమర్శలొచ్చాయి.
- విమర్శలు చూసి షాకయ్యానని, సన్నివేశాలు ఉద్దేశించినట్లు రాలేదన్నారు బుచ్చిబాబు.
- భవిష్యత్తులో మహిళా పాత్రల విషయంలో జాగ్రత్తగా ఉంటానని దర్శకుడు స్పష్టం చేశారు.
బాక్సాఫీస్ బరిలో రామ్ చరణ్ 'పెద్ది' కలెక్షన్స్ (Peddi Collections) బావున్నాయి. ఈ సినిమా రెండు రోజుల్లో 150 కోట్లు కలెక్ట్ చేసింది. రామ్ చరణ్ నటనపై ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే... హీరోయిన్ జాన్వీ కపూర్ రోల్, ఆమె డ్రస్సింగ్ మీద చాలా విమర్శలు వచ్చాయి. వాటిపై దర్శకుడు బుచ్చిబాబు సానా స్పందించారు.
జాన్వీ డ్రస్‌లేంటి? ఆ కెమెరా యాంగిల్స్ ఏంటి?
'పెద్ది'లో అచ్చియ్యమ్మ పాత్రలో జాన్వీ కపూర్ నటించారు. విజయనగరంలోని ఓ రాజకీయ నాయకురాలి కుమార్తెగా కనిపించారు. ఆ పాత్రను మరీ శృంగారాత్మకంగా చూపించారని విమర్శలు వచ్చాయి. అంతే కాదు... హీరో హీరోయిన్ మధ్య తీసిన రొమాంటిక్ సన్నివేశాలు సైతం బాలేదని విమర్శకులతో పాటు కొందరు ప్రేక్షకులు సైతం భావిస్తున్నారు.
జాన్వీ కపూర్ ఫేస్ చూపించకుండా ఎక్కువ సేపు నడుము, ఇతర బాడీ పార్ట్స్ మాత్రమే చూపించారని... వాటిపై కాన్సంట్రేట్ చేశారని దర్శకుడు బుచ్చిబాబు సానాను విమర్శించారు. ముఖ్యంగా పలు సన్నివేశాల్లో లంగా ఓణీ మీద పైట తీసి నడిచే తీరు అసలు బాలేదన్నారు. అమ్మాయి అనుమతి లేకుండా ఆమెను ముద్దు పెట్టుకోవడం, ముద్దుకు ముందు స్నేహితులతో హీరో చెప్పే అంశాలపై కూడా పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విమర్శలు దర్శకుడి వరకు వెళ్లాయి. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాటి గురించి ప్రస్తావించగా...
అమ్మాయికి బలవంతంగా ముద్దు పెట్టి ప్రేమ అంటారేంటి? అని హీరో క్యారెక్టర్ రాసిన తీరును కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలో నెగిటివిటీపై బుచ్చిబాబు సానా స్పందిస్తూ... ''విమర్శలు చూసి షాక్ అయ్యాను. ఆ సన్నివేశాలను అలా రిసీవ్ చేసుకుంటారని అసలు ఊహించలేదు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ మధ్య చక్కటి, ఆహ్లాదకరమైన ప్రేమకథను చూపించాలని అనుకున్నాను. నా ఉద్దేశం కూడా అదే. అయితే కొన్ని సన్నివేశాలు ఉద్దేశించిన విధంగా రాలేదు'' అని చెప్పారు. అంతే కాదు... 'పెద్ది'లో హీరోయిన్ ట్రాక్ మీద వచ్చిన విమర్శలు తనను పునరాలోచనలో పడేశాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో హీరోయిన్ లేదా మహిళా పాత్రలు రాసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటానని బుచ్చిబాబు తెలిపారు.
Photo Gallery: Dhootha Season 2 Launch Photos - నాగార్జున క్లాప్‌తో మొదలైన 'దూత 2' వెబ్ సిరీస్... ప్రియ, పార్వతి & టీంతో నాగచైతన్య ఫోటోలు
Frequently Asked Questions
'పెద్ది' సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు ఎలా ఉన్నాయి?
'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై ఎలాంటి విమర్శలు వచ్చాయి?
జాన్వీ కపూర్ పాత్రను శృంగారాత్మకంగా చూపించారని, ఆమె డ్రెస్సింగ్, కెమెరా యాంగిల్స్‌పై విమర్శలు వచ్చాయి. హీరో ఆమెను బలవంతంగా ముద్దుపెట్టుకోవడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు.
'పెద్ది' సినిమాపై వచ్చిన విమర్శలకు దర్శకుడు బుచ్చిబాబు సానా ఎలా స్పందించారు?
విమర్శలు చూసి షాక్ అయ్యానని, సన్నివేశాలు అలా వస్తాయని ఊహించలేదని బుచ్చిబాబు సానా అన్నారు. భవిష్యత్తులో మహిళా పాత్రల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటానని తెలిపారు.
జాన్వీ కపూర్‌ను ఎలా చిత్రీకరించారని 'పెద్ది'లో విమర్శలు వచ్చాయి?
జాన్వీ ముఖం చూపించకుండా నడుము, ఇతర శరీర భాగాలపై ఎక్కువ దృష్టి పెట్టారని విమర్శించారు. లంగా ఓణీలో పైట తీసి నడిచే విధానం కూడా బాలేదని అన్నారు.
ట్రెండింగ్ వార్తలు






















