Peddi Celebrity Show : పెద్దిపై టాలీవుడ్ స్టార్స్ ఫస్ట్ రివ్యూస్... ఆ థియేటర్‌కు ఉపాసన, టాప్ సెలబ్రిటీలు
Upasana Visits Vimal Theater : రామ్ చరణ్‌తో పాటు పెద్ది టీంకు టాలీవుడ్ సెలబ్రిటీలు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఉపాసనతో పాటు టాప్ సెలబ్రిటీలు విమల్ థియేటర్‌లో మూవీ చూడనున్నారు.

Upasana Watches Peddi : తెలుగు రాష్ట్రాల్లో పెద్ది సందడి మొదలైంది. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో థియేటర్స్ వద్ద మెగా ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ సెలబ్రిటీలు చరణ్‌కు విషెష్ చెబుతున్నారు. మాస్ యాక్షన్ చూసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఆ థియేటర్‌కు ఉపాసన
రామ్ చరణ్ భార్య ఉపాసనతో (Upasana) హైదరాబాద్ విమల్ 700MM థియేటర్లో పెద్ది చూడనున్నారు. స్పెషల్ ప్రీమియర్‌కు డైరెక్టర్ సుకుమార్ సహా ఇతర సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. దీంతో ఇది సెలబ్రిటీల ప్రీమియర్‌గా మారనుంది. చరణ్ సహా మూవీ టీంకు అందరూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. థియేటర్ వద్ద భారీ కటౌట్స్, క్రాకర్స్‌తో ఫ్యాన్స్ సందడి షురూ చేశారు.
సెలబ్రిటీల రివ్యూస్
- 'పెద్ది కోసం రామ్ చరణ్ అన్న ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. పని పట్ల మీకున్న అంకితభావం ఎందరికో స్ఫూర్తిదాయకం. బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్, టీం అందరికీ శుభాకాంక్షలు. సినిమా బిగ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా'. అని వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు.
- 'ఇది పెద్ది టైమ్. మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. చరణ్ పెర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ఆయన సూపర్ టాలెంటెడ్. టీమ్‌కు విషెష్ తెలియజేస్తున్నా. బ్లాక్ బస్టర్ వైబ్స్ ఫీల్ అవుతున్నా.' - సమంత
- మెగా 158 టీం మూవీ షూటింగ్ సెట్స్ నుంచే పెద్ది టీంకు విషెష్ తెలిపింది. 'రామ్ చరణ్, బుచ్చిబాబు, వృద్ధి సినిమాస్‌కు ఆల్ ది బెస్ట్.' అంటూ స్పెషల్ వీడియో షేర్ చేసింది. చిరు హీరోగా డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పొల్లాచిలో జరుగుతుంది.
FROM THE SETS OF #ChiruBobby2...
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) June 3, 2026
TO THE PHENOMENON CALLED #PEDDI ❤️🔥
Team #Mega158 proudly extend their best wishes to the Mega Power Star @AlwaysRamCharan, Director @BuchiBabusana, @vriddhicinemas and the whole team of PEDDI for a MASSIVE BLOCKBUSTER 💥💥💥
Shoot in progress at… pic.twitter.com/58hlIi2xWA
- 'ఫస్ట్ డే నుంచే పెద్ది జర్నీ ఆసక్తి రేకెత్తించింది. రామ్ చరణ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, కమిట్మెట్ డెడికేషన్ అసాధారణమైనవి. పెద్ది బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి కొన్నాళ్ల పాటు గుర్తుండిపోయే వేడుకగా నిలవాలని ఆశిస్తున్నా' - అనిల్ రావిపూడి
Also Read : Ram Charan : రామ్ చరణ్ దేవాలయం - అర్జున్ థియేటర్ వద్ద చరణ్ విగ్రహంపై ట్రోలింగ్స్... సారీ చెప్పిన ఫ్యాన్స్
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















