పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చే సినిమా 'ఆర్ఎక్స్ 100'. అందులో పాటలు, ఆ పాటల్లో ఆమె గ్లామర్ యువతకు నచ్చాయి. 'ఆర్ఎక్స్ 100' తర్వాత వరుస అవకాశాలు అయితే వచ్చాయి గానీ విజయాలు రాలేదు. మళ్ళీ 'మంగళవారం'తో మరో విజయం వరించింది. ఈ మధ్యలో తన తండ్రిని కోల్పోయింది పాయల్. ఆ బాధ నుంచి తేరుకోవడానికి ఆధ్యాత్మిక పంథాలోకి వెళ్ళింది. యోగ చేసింది. ఆ అంశం గురించి ఓ నెటిజన్ ప్రశ్నించగా... కన్నీళ్లు పెట్టుకుంది పాయల్. 

కన్నీళ్లు పెట్టుకుని స్టేజి దిగి వెళ్లిన పాయల్!పాయల్ రాజ్‌పుత్ కొంత విరామం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదీ ఆమె సినిమా కోసం కాదు. పాయల్ కొంత కాలంగా సౌరభ్ దింగ్రాతో ప్రేమలో ఉన్నారు. తనకు కష్ట కాలంలో సౌరభ్ అండగా ఉన్నాడని ఆమె తెలిపిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అతను హీరోగా 'ఫస్ట్ టైమ్ 01-01-01' అని ఓ సినిమా రూపొందింది.

Also Read: Ashu Reddy Audio Leaked: టైమ్ ఇస్తే కోటిన్నర ఇస్తా - సెటిల్‌మెంట్‌కు ప్రయత్నిస్తూ అషు రెడ్డి వార్నింగ్ - ఆడియో లీక్

'ఫస్ట్ టైమ్ 01-01-01' సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం మంగళవారం రాత్రి హైదరాబాద్ సిటీలో జరిగింది. ఆ కార్యక్రమానికి పాయల్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. అప్పుడు ఆమె డిప్రెషన్ గురించి ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. తన తండ్రిని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు పాయల్. ఆమెను ఓదార్చడానికి సౌరభ్ ప్రయత్నించారు. కానీ, కంట్రోల్ కాలేదు పాయల్. కొన్ని క్షణాల తర్వాత వేదిక దిగి వెళ్లిపోయారు.

Also ReadSreenivasa Kavyanam: తిరుమలలో శ్రీనివాస కళ్యాణం... కావ్యతో బెల్లంకొండ పెళ్లి ముహూర్తం నుంచి రిసెప్షన్ వరకూ... ఆల్ డీటెయిల్స్‌ తెలుసుకోండి

మే 22న థియేటర్లలోకి 'ఫస్ట్ టైమ్ 01-01-01'First Time Telugu Movie Release Date: సౌరభ్ దింగ్రా హీరోగా పరిచయం అవుతున్న 'ఫస్ట్ టైమ్ 01-01-01' సినిమాను మే 22న థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో గాయత్రీ గుప్తా ఓ కీలక పాత్ర పోషించారు. ట్రైలర్ కంటే ఎక్కువగా పాయల్ ఎమోషనల్ వీడియో వైరల్ అవుతోంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Also ReadTrisha: త్రిషకు నిద్రలేని రాత్రులు... 2062 వరకు సెట్ అవ్వదా?