Pawan Kalyan UBS Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులలో, తెలుగు ప్రేక్షకులలో 'ఉస్తాద్ భగత్ సింగ్' మీద అంచనాలు ఉన్నాయ్. 'ఓజీ: దే కాల్ హిమ్' ఓజీ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా కావడం ఒక కారణం అయితే... కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడం మరొక కారణం. మార్చి ఆఖరి వారంలో సినిమా రిలీజ్ అని అనౌన్స్ చేశారు. ఫ్యాన్స్ అంతా సినిమాలో రెండో సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో చిత్ర బృందానికి ఒక షాక్ తగిలింది. అది ఏమిటంటే... 

రిలీజుకు ముందు రెండో సాంగ్ లీక్!Ustaad Bhagat Singh 2nd Single Release News: 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ సాంగ్ 'దేఖ్ లేంగే సాలా' చార్ట్ బస్టర్ అయ్యింది. రెండో పాటను త్వరలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సమయంలో ఆ సాంగ్ నెట్టింట లీక్ అయ్యింది. దాంతో టీం షాక్ తిన్నదని సమాచారం. ఇప్పుడు త్వరలో సాంగ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

Also Read: Monday Box Office: సడన్‌గా 'యుఫోరియా'కు పెరిగిన కలెక్షన్లు... దుకాణం సర్దేసిన 'బరాబర్ ప్రేమిస్తా' - మండే బాక్సాఫీస్ రిపోర్ట్

Ustaad Bhagat Singh Release Date: పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను మార్చి 26న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో పవన్ సరసన శ్రీ లీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు.

Also Readఓటీటీ లవర్స్‌కు అదిరిపోద్దీ వారం... బ్లాక్‌బస్టర్ హిట్స్ & ఒరిజినల్ ఫిలిమ్స్... ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 15 వరకు, ఈ వారం సందడి చేసే సినిమాలు & వెబ్ సిరీస్‌ల లిస్ట్