Aura Of Ustaad Song : పవన్ కల్యాణ్ 'ఆరా ఆఫ్ ఉస్తాద్' సాంగ్ - పవర్ స్టార్ మేనరిజం... ఇదే పవ'నిజం'
Ustaad Bhagat Singh Second Song : పవన్ కల్యాణ్ 'ఆరా ఆఫ్ ఉస్తాద్' సాంగ్ వచ్చేసింది. పవర్ స్టార్ మేనరిజం ఎలివేట్ చేసేలా ఉన్న పాట దేవిశ్రీ బీజీఎంతో ట్రెండ్ అవుతోంది.

Pawan Kalyan's Ustaad Bhagat Singh Aura Of Usttad Full Video Song : పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్ వచ్చేసింది. 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి రెండో సాంగ్ 'ఆరా ఆఫ్ ఉస్తాద్' రిలీజైంది. పవర్ స్టార్ స్టైల్, మేనరిజం ఎలివేట్ చేసేలా ఉన్న పాట భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.
దిస్ ఈజ్ పవర్ స్టార్
రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా... పవన్ కల్యాణ్ మేనరిజాన్నే హైలెట్ చేస్తూ చేసిన సాంగ్ ఆకట్టుకుంటోంది. అది డీకోడ్ చేసేలా ఉన్న లిరిక్స్ వేరే లెవల్. 'నేను మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే...' అంటూ పవన్ చెప్పే డైలాగ్‌తో సాంగ్ ప్రారంభం కాగా... 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే... జుట్టు ఎగురుతుంటే ఇక దడ దడ పిడుగులు పడినట్టే...' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. పవర్ స్టార్ స్టైల్‌ను అద్భుతంగా చూపించారు.
ఈ పాటకు ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ లిరిక్స్ రాయగా... దేవిశ్రీ ప్రసాద్, అభిషేక్ పాడారు. 'గబ్బర్ సింగ్', 'భీమ్లా నాయక్' తర్వాత పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్'లో నటిస్తుండగా... 'ఆరా ఆఫ్ ఉస్తాద్' సాంగ్‌తో మూవీ ఎలా ఉండబోతుందో ఫ్యాన్స్ ఓ అంచనాకు వచ్చేశారు.
ఇప్పటికే రిలీజ్ చేసిన 'దేఖ్‌లేంగే సాలా' సాంగ్ గూస్ బంప్స్ క్రియేట్ చేస్తుండగా... దానికి పదింతలు మించి హైప్ ఇచ్చేలా లేటెస్ట్ సాంగ్ ఉంది. దేఖ్ లేంగే సాంగ్‌లో వింటేజ్ పవన్ లుక్, స్టెప్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఫ్యాన్స్ పవన్ స్టెప్పులను వరల్డ్ ఫేమస్ సింగర్ మైఖేల్ జాక్సన్‌తో పోలుస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.
Also Read : హిస్టారికల్ ప్లేస్‌లో 'జై హనుమాన్' - అంజనాద్రి బెట్టపై పూజా కార్యక్రమంతో... స్పెషల్ ఏంటో తెలుసా?
ఈ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా... పవన్ కల్యాణ్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫోటోగ్రాఫర్ పాత్రలో రాశీ ఖన్నా, పొలిటికల్ లీడర్ నల్ల నాగప్ప పాత్రలో తమిళ సీనియర్ హీరో పార్తీబన్ విలన్ రోల్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. సమ్మర్ స్పెషల్‌గా వరల్డ్ వైడ్‌గా మార్చి 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
హరీష్, పవన్ కాంబో అంటేనే థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం. ఇంతకు ముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన 'గబ్బర్ సింగ్' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో వస్తోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా బ్లాక్ బస్టర్ కావడం కన్ఫర్మ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
𝐏 𝐊
— Mythri Movie Makers (@MythriOfficial) February 22, 2026
Two letters.
INFINITE AURA 🔥🔥#UstaadBhagatSingh second single #AuraOfUstaad out now ❤🔥
▶️ https://t.co/YFOQmGNaR9#UstaadBhagatSingh GRAND RELEASE WORLDWIDE ON 26th MARCH, 2026.#UBSOnMarch26th
POWER STAR @PawanKalyan @harish2you @sreeleela14 #RaashiiKhanna… pic.twitter.com/o8jM88DiVe
























