Pawan Kalyan's Ustaad Bhagat Singh First Song Special Video Out : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబో అవెయిటెడ్ యాక్షన్ డ్రామా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా మేకర్స్ బిగ్ ట్రీట్ ఇచ్చారు.
స్పెషల్ వీడియో రిలీజ్
ఫస్ట్ సాంగ్‌కు సంబంధించి పవన్ కల్యాణ్ అండ్ టీం డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఈ మేకింగ్ వీడియోలో పవన్ డ్యాన్స్ చేస్తూ ఫుల్ జోష్‌తో కనిపించారు. త్వరలోనే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. 'మీరు ఇష్టపడే వ్యక్తి. మీలో జోష్ నింపే డ్యాన్స్. మీకు సెలబ్రేట్ చేసుకునే యాటిట్యూడ్, మీరు పూజించే వ్యక్తి. ఇదంతా మా కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ ఊహించిన ఒకే పాటలో' అంటూ రాసుకొచ్చారు.
దీంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇటీవల ఓ ఈవెంట్‌లో డిసెంబరులోనే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తామని డైరెక్టర్ హరీష్ చెప్పారు. లేటెస్ట్ వీడియో వైరల్ అవుతుండగా... ఇక ఉస్తాద్ సందడి స్టార్ట్ అంటూ పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్‌లో పవన్ లుక్ అదిరిపోయింది. వింటేజ్, స్టైలిష్ లుక్‌లో పవర్ స్టార్ గూస్ బంప్స్ తెప్పించారంటూ కామెంట్స్ వచ్చాయి.
Also Read : సమంత రాజ్‌ల వివాహం - హీరోయిన్ పూనమ్ ట్వీట్ వైరల్... పరోక్షంగా అలా అనేసిందేంటి?
ఈ మూవీలో యంగ్ బ్యూటీ శ్రీలీలతో పాటు రాశీఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కనిపించనుండగా... ఫోటోగ్రాఫర్‌గా రాశీఖన్నా కనిపించనున్నారు. పార్తీబన్ విలన్ రోల్ చేస్తుండగా... నవాబ్ షా, కేఎస్ రవికుమార్, కేజీఎఫ్ ఫేం అవినాష్, రాంకీ, టెంపర్ వంశీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా... వచ్చే ఏడాది సమ్మర్‌కు మూవీ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
గతంలో హరీష్, పవన్ కాంబోలో వచ్చిన 'గబ్బర్ సింగ్' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఆ మూవీలోనూ పవన్ పోలీస్ ఆఫీసర్‌గా అదరగొట్టారు. ఇప్పుడు ఈ మూవీ కూడా అంతే స్థాయిలో హిట్ కావడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాకింగ్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా... థియేటర్స్ దద్దరిల్లడం కన్ఫర్మ్ అంటున్నారు. త్వరలోనే ఫస్ట్ సాంగ్‌తో పాటు మిగిలిన అప్డేట్స్ కుడా రానున్నాయి.