Pawan Kalyan's Ustaad Bhagat Singh Dekhlenge Saala Song New Record : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆకలి తీరింది. డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక్క సాంగ్‌తోనే వారికి బిగ్ ట్రీట్ ఇచ్చారు. వింటేజ్, స్టైలిష్ పవన్‌ను చాలా రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై చూపించబోతున్నారు. 'గబ్బర్ సింగ్' తర్వాత ఇద్దరి కాంబోలో రాబోతోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
24 గంటల్లోనే...
కేవలం 24 గంటల్లోనే 'ఉస్తాద్ భగత్ సింగ్' 'దేఖ్‌లేంగే సాలా' సాంగ్ రికార్డ్ క్రియేట్ చేసింది. దాదాపు 29.6 మిలియన్ల వ్యూస్‌కు పైగా సాధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. గతంలో ఉన్న రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తుండగా... పవన్ వింటేజ్ స్టెప్పులు వేరే లెవల్‌లో ఉన్నాయి. ఈ పాటకు దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
పవన్‌ను ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలని తపించారో అలానే చూపించారు డైరెక్టర్ హరీష్. మాస్ టచ్ ఇస్తూనే యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉన్న ఈ పాటకు భాస్కర భట్ల లిరిక్స్ అందించగా... విశాల్ ధడ్లానీ, హరిప్రియ పాడారు. యంగ్ బ్యూటీ శ్రీలీల సైతం పవన్‌తో కలిసి స్టెప్పులేశారు.
ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీటే
'గబ్బర్ సింగ్' తర్వాత అంతే స్థాయిలో పవన్ ఫ్యాన్స్ ఆయన నుంచి మూవీ ఎక్స్ పెక్ట్ చేశారు. మళ్లీ ఇన్నేళ్లకు హరీష్ దాన్ని నిజం చేయబోతున్నారు. ముఖ్యంగా 'గబ్బర్ సింగ్'లోని పాటలు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. తాజాగా 'ఉస్తాద్'లో 'దేఖ్‌లేంగే సాలా' సాంగ్ సైతం అంతే స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ పాట నిజంగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ అనే చెప్పాలి. ఇక రాబోయే సాంగ్స్, అప్డేట్స్ కూడా ఒకదాన్ని మించి మరొకటి ఉంటాయని స్పష్టం అవుతోంది.
మూవీలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. పవర్ స్టార్ సరసన రాశీ ఖన్నా, యంగ్ బ్యూటీ శ్రీలీల ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పార్తీబన్ కీలక పాత్ర పోషిస్తుండగా... మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ మూవీని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.