Pawan Kalyan Sujeeth About OG Sequel : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. బ్లాక్ బస్టర్ OG సీక్వెల్‌కు రంగం సిద్ధమైంది. ఏపీ డిప్యూటీ సీఎంగా ఓవైపు పాలనలో బిజీగా ఉంటూనే మరోవైపు కాస్త టైం దొరికినప్పుడల్లా మూవీస్‌పై ఫోకస్ చేస్తున్నారు పవన్. OG సీక్వెల్‌పై పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది.

Continues below advertisement

స్టోరీ డిస్కషన్

OG సీక్వెల్ స్టోరీపై డైరెక్టర్ సుజిత్ పవన్‌తో డిస్కస్ చేశారు. రీసెంట్‌గానే ఓజీ సీక్వెల్ ఉంటుందని పలు సందర్భాల్లో పవన్ కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు సుజిత్ వెకేషన్ తర్వాత పవర్ స్టార్‌తో డిస్కస్ చేసిన పిక్ వైరల్ అవుతోంది. 'ప్రామిస్ నెరవేర్చే దిశగా ప్రయాణం.' అంటూ పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ ట్వీట్ చేసింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్, మూవీ షూటింగ్‌కు ముందే డిస్కషన్స్ ఈ స్థాయిలో ఉంటే రాబోయే రోజుల్లో మరిన్ని సర్ప్రైజెస్ ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Continues below advertisement

Also Read : Peddi : పెద్ది బ్లాక్ బస్టర్ ఈవెంట్ - వెన్యూ, డేట్ అండ్ టైం ఫిక్స్... మెగాస్టార్ వస్తారా?

షూటింగ్ ఎప్పుడంటే?

ఓజీ మూవీ పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. వరల్డ్ వైడ్ దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. క్లైమాక్స్‌లోనే సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చేశారు డైరెక్టర్ సుజీత్. ఆ తర్వాత OG యూనివర్స్ కూడా అనౌన్స్ చేయడంతో ప్రీక్వెల్, సీక్వెల్ కూడా కన్ఫర్మ్ అయిపోయాయి. రీసెంట్‌గా కొన్ని సందర్భాల్లో పవన్ కల్యాణ్ OG సీక్వెల్‌పై కామెంట్స్ చేయడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు.

'ఉస్తాద్ భగత్ సింగ్' తర్వాత పాలనలో బిజీగా మారుతున్నా... సొంత ప్రొడక్షన్ హౌస్ పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచే OG అప్డేట్ రావడంపై ఫుల్ ఖుష్ అవుతున్నారు. లేటెస్ట్‌గా పవన్‌తో సుజిత్ స్టోరీ డిస్కషన్ పెట్టడం ఆనందాన్ని రెట్టింపు చేసింది. దీంతో త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందంటూ ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో OG సీక్వెల్ ట్రెండ్ అవుతోంది. నవంబరులో పూజా కార్యక్రమాలతో OG 2 షూటింగ్ ప్రారంభించనున్నట్లు ఫిలింనగర్ వర్గాల టాక్. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

Also Read : Baahubali Torchbearer OTT : ఓటీటీలోకి బాహుబలి ది టార్చ్ బ్యారర్ - ఫ్యాన్స్‌కు మరో సర్ప్రైజ్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.