Ustad Bhagat Singh Movie Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంత? అది 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు? ఆయనకు నిర్మాతల ఎంత అమౌంట్ ఆఫర్ చేశారు? సోషల్ మీడియా నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో జనాల వరకు ఇప్పుడు ఇదే హాట్ డిస్కషన్.
ఉస్తాద్ రెమ్యూనరేషన్... 170 కోట్లు!?'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకు గాను పవన్ కళ్యాణ్ (Pawan Kalyan remuneration)కు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వై 170 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారట. సౌత్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక జర్నలిస్ట్ ఈ విషయం ట్వీట్ చేయడంతో హాట్ డిస్కషన్ మొదలైంది. పాన్ ఇండియా మార్కెట్ ఉన్న హీరోలకు సైతం 100 నుంచి 150 కోట్లు ఆఫర్ చేస్తున్నారు. వాళ్లు సైతం కళ్ళు చెదిరే అమౌంట్ పవన్ తీసుకోవడం డిస్కషన్ పాయింట్ అయ్యింది.
'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందు పవన్ హీరోగా ఆయన డైరెక్ట్ చేసిన 'గబ్బర్ సింగ్' సినిమా అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు అందరిని మెప్పించింది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్ మీద అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందువల్ల భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారట.
ఏపీ డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన తర్వాత సినిమాలకు సమయం కేటాయించడం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు కష్టం అవుతోంది. పాలనా పరమైన బాధ్యతలు ఒక వైపు... ప్రజలతో మమేకం అవుతూ చేసే పర్యటనలు మరో వైపు... నిత్యం బిజీగా ఉండటం వల్ల గత ఏపీ ఎన్నికలకు ముందు ప్రారంభించిన సినిమా చిత్రీకరణలకు పవన్ కళ్యాణ్ డేట్స్ అడ్జస్ట్ చేయడం కాస్త ఇబ్బంది అవుతోంది. అయితే నిర్మాతలు ఇప్పటికే బోలెడంత పెట్టుబడి పెట్టడంతో త్వరగా సినిమాలు ఫినిష్ చేయాలని పవన్ డిసైడ్ అయ్యారు.
Also Read: 'బేబీ' నిర్మాతలతో కలిసి కిరణ్ అబ్బవరం కొత్త సినిమా... క్యాచీ టైటిల్ ఫిక్స్ చేశారండోయ్
'ఉస్తాద్ భగత్ సింగ్' నిర్మాతలలో ఒకరైన మైత్రి మూవీ మేకర్స్ నవీన్, 'ఓజీ' నిర్మాత డివివి దానయ్యను ఇటీవల అమరావతికి పిలిపించిన పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ గురించి డిస్కస్ చేశారట. ఏయం రత్నం నిర్మాణంలో రూపొందుతున్న 'హరిహర వీరమల్లు' చిత్రీకరణ చివరి దశకు వచ్చిన నేపథ్యంలో జూలై నుంచి 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రీకరణకు డేట్స్ కేటాయిస్తానని చెప్పారట. ఆలోపే 'ఓజీ' షూటింగ్ కూడా ఫినిష్ చేయాలని భావిస్తున్నారట ఈ మూడు సినిమాల తర్వాత పవన్ కొత్త సినిమాలు అంగీకరించే అవకాశం లేదని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. రాబోయే ఏడాది లోపు ఈ మూడు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి.