News
News
X

Pawan Kalyan Mahesh Babu : ఆ రోజు మహేష్ బాబుకు మద్దతుగా నిలిచా - పవన్ కళ్యాణ్ 

సూపర్ స్టార్ మహేష్ బాబుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అంతే కాదు... గతంలో మహేష్ బాబుకు తాను మద్దతుగా నిలిచిన విషయాన్ని చెప్పారు.

FOLLOW US: 

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు, అశేష సంఖ్యలో ఉన్న అభిమానులు బర్త్ డే విషెస్ చెప్పారు. జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. గతంలో మహేష్ బాబుకు తాను ఏ విధంగా మద్దతు తెలిపినదీ, తన సినిమాకు సూపర్ స్టార్ వాయిస్ ఓవర్ ఇవ్వడం వెనుక ఉన్న కారణాన్ని తెలిపారు.

Pawan Kalyan Birthday Wishes To Mahesh Babu : ''ప్రముఖ కథానాయకులు శ్రీ మహేష్ బాబు గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తన దైన శైలి నటనతో నవతరం ప్రేక్షకులను ఆయన మెప్పిస్తున్నారు. హృద్రోగంతో బాధ పడే చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారు. అది అభినందనీయం. కృష్ణ ఘట్టమనేని గారి నట వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ... తండ్రి బాటలోనే దర్శకులకు, నిర్మాతలకు అండగా నిలుస్తున్నారు'' అని ఓ లేఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

అప్పుడు మహేష్‌కు అండగా నిలిచా : పవన్ కళ్యాణ్  
'అర్జున్' సినిమా విడుదల అయిన సందర్భంలో పైరసీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ... మహేష్ బాబు గళం వినిపిస్తే ఆయనకు మద్దతుగా నిలిచిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. చలన చిత్ర పరిశ్రమను కాపాడుకొనేందుకు ఆయన ముందుకు రావడంతో తామంతా మహేష్ వెన్నంటి నిలిచామని చెప్పారు.

పవన్ కళ్యాణ్ 'జల్సా' సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'జల్సా'లో హీరో సంజయ్ సాహూ పాత్రను పరిచయం చేస్తూ వచ్చిన వాయిస్ సూపర్ స్టార్‌దే. హీరో పాత్ర పరిచయానికి మహేష్ నేపథ్య గాత్రం అయితే బాగుంటుందని దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కోరగానే అంగీకరించిన సహృదయత ఆయనది అని పవన్ కళ్యాణ్ గొప్పగా చెప్పారు.

కథానాయకుడిగా ప్రేక్షకుల మెప్పు, పురస్కారాలూ అందుకొంటున్న మహేష్ బాబు గారు మరిన్ని విజయాలు అందుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. 

Also Read : ఆ రెండూ తప్ప - తనకు తాను మహేష్ బాబు పెట్టుకున్న రూల్స్ ఏంటో తెలుసా?

మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాలలో చాలా మంది అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పేదలకు అన్నదానం చేయడంతో పాటు పిల్లలకు పుస్తకాలు పంచడం వంటివి చేశారు. కొంత మంది రక్తదాన శిబిరాలు నిర్వహించారు. 

Also Read : ‘మహీ, నా జీవితంలో వెలుగులు నింపావ్’ - భర్తకు నమ్రతా విషెస్, సూపర్ స్టార్‌కు చిరు, రోజా ట్వీట్స్!

Published at : 09 Aug 2022 06:46 PM (IST) Tags: Mahesh Babu pawan kalyan Pawan Kalyan On Mahesh Babu Pawan Supports Mahesh

సంబంధిత కథనాలు

Pawan Kalyan: ప్లాప్ డైరెక్ట‌ర్‌తో పవన్ కళ్యాణ్ సినిమా - లాంఛింగ్ కి రెడీ!

Pawan Kalyan: ప్లాప్ డైరెక్ట‌ర్‌తో పవన్ కళ్యాణ్ సినిమా - లాంఛింగ్ కి రెడీ!

Balakrishna's Unstoppable 2 Trailer : విజయవాడలో బాలకృష్ణ 'అన్‌స్టాప‌బుల్‌ 2' ట్రైలర్

Balakrishna's Unstoppable 2 Trailer : విజయవాడలో బాలకృష్ణ 'అన్‌స్టాప‌బుల్‌ 2' ట్రైలర్

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?

Bandla Ganesh: వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా: పవన్‌పై బండ్ల గణేష్ ట్వీట్

Bandla Ganesh: వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా: పవన్‌పై బండ్ల గణేష్ ట్వీట్

Varun Tej New Movie Update : యాక్షన్ విత్ మెసేజ్ - వరుణ్ తేజ్ సినిమా డీటెయిల్స్ చెప్పిన ప్రవీణ్ సత్తారు

Varun Tej New Movie Update : యాక్షన్ విత్ మెసేజ్ - వరుణ్ తేజ్ సినిమా డీటెయిల్స్ చెప్పిన ప్రవీణ్ సత్తారు

టాప్ స్టోరీస్

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

TDP Twitter Hack : టీడీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ - ఇప్పుడు అందులో ఏం పోస్టులు ఉన్నాయంటే ?

TDP Twitter Hack : టీడీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ - ఇప్పుడు అందులో ఏం పోస్టులు ఉన్నాయంటే ?

INDW Vs SLW, Asia Cup 2022: శ్రీలంకపై చెలరేగిన జెమీమా - ఎంత కొట్టారంటే?

INDW Vs SLW, Asia Cup 2022: శ్రీలంకపై చెలరేగిన జెమీమా - ఎంత కొట్టారంటే?

5G In India: మీ చేతిలో ఉన్న ఫోనే మీకున్న సూపర్ పవర్ - ఇది నిజం

5G In India: మీ చేతిలో ఉన్న ఫోనే మీకున్న సూపర్ పవర్ - ఇది నిజం