అమలాపురంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా, ప్రేమ్ కుమార్ అనే అభిమాని విద్యుత్ షాక్‌కు గురై మరణించారు. ఈ ఘటన పవన్ కళ్యాణ్‌ను తీవ్రంగా కలచివేసింది.
Pawan Kalyan: మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
Pawan Kalyan Fan Death: పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా అమలాపురంలో ఫ్లెక్సీలు కడుతూ ఓ అభిమాని మృతి చెందారు. అతని మరణంపై ఏపీ డిప్యూటీ సీఎం స్పందించారు.

- అమలాపురంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో అభిమాని మృతి.
- ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్‌కు గురై ప్రేమ్ కుమార్ కన్నుమూశారు.
- ఈ ఘటనపై పవన్ తీవ్ర దిగ్భ్రాంతి, కుటుంబానికి అండగా నిలిచారు.
- అభిమానులు స్వీయ భద్రత పాటించాలని పవన్ విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా చేయాలని అమలాపురంలో అభిమానులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేశారు. అయితే... అక్కడ చోటు చేసుకున్న ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. పవన్ పుట్టినరోజు వేడుకల కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సమయంలో ప్రేమ్ కుమార్ అనే అభిమాని విద్యుత్ షాక్‌కు గురై మరణించారు. ఈ దురదృష్టకర ఘటనపై పవన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నన్ను తీవ్రంగా కలచివేసింది - పవన్ కళ్యాణ్
Pawan Kalyan Reaction On Fan Prem Kumar Death: అమలాపురంలో జరిగిన ప్రమాదంలో తన అభిమాని, జన సైనికుడు రోళ్ల ప్రేమ్ కుమార్ మరణం తనను ఎంతగానో కలచివేసిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
"అమలాపురంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైన ప్రేమ్ కుమార్ ప్రాణాలు కోల్పోవడం నన్ను ఎంతగానో కలచివేసింది. ప్రేమ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ... ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రేమ్ కుమార్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా నిలబడతానని ఆయన భరోసా ఇచ్చారు.
స్వీయ భద్రత పాటించండి... పవన్ సూచన
అత్యుత్సాహంతో చేసే పనుల వల్ల ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని అభిమానులకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. "జీవితం ఎంతో అమూల్యమైనది. (పుట్టినరోజు) వేడుక, ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సమయంలో మన కోసం ఒక కుటుంబం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి" అని అభిమానులకు పవన్ కళ్యాణ్ జాగ్రత్తలు చెప్పారు. ముఖ్యంగా ఎత్తైన ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసేటప్పుడు, భారీ ర్యాలీలు నిర్వహించేటప్పుడు స్వీయ భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
రోళ్ల ప్రేమ్ కుమార్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయనది అమలాపురం ప్రాంతంలోని బెండ ముర్లంక. తన అభిమాన నాయకుడు, కథానాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలలో పాల్గొనడానికి స్నేహితులతో కలిసి సొంతూరికి వెళ్ళారు. బుధవారం అమలాపురంలోని ఓ కాలేజీ సమీపంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు బ్యానర్‌ను కడుతుండగా... ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ల తగిలి తీవ్ర విద్యుత్ ఘాతానికి గురయ్యారు. అక్కడికక్కడే కన్నుమూశారు.
Before You Go
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
Frequently Asked Questions
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా అమలాపురంలో ఏమి జరిగింది?
అభిమాని మరణంపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందించారు?
పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఇది తనను ఎంతగానో కలచివేసిందని తెలిపారు. ప్రేమ్ కుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి, ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఈ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులకు ఏమి సూచించారు?
అతి ఉత్సాహంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, జీవితం అమూల్యమైనదని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేటప్పుడు, ర్యాలీలు నిర్వహించేటప్పుడు స్వీయ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ట్రెండింగ్ వార్తలు





















