OG Sequel : పవన్ కల్యాణ్ OG సీక్వెల్ - ఫ్యాన్స్ గెట్ రెడీ... తమన్ బిగ్ అప్డేట్
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ OG సీక్వెల్‌పై మ్యూజిక్ లెజెండ్ తమన్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. హృదయం మురళి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు.

Thaman Reaction About Pawan Kalyan OG Sequel : పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు మ్యూజిక్ లెజెండ్ తమన్ గుడ్ న్యూస్ చెప్పారు. సెప్టెంబరులో OG సీక్వెల్ స్టార్ట్ కానుందని కన్ఫర్మ్ చేశారు. ఆయన కీలకపాత్రలో నటించిన 'హృదయం మురళి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో బిగ్ అప్డేట్ ఇచ్చారు. OG అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేయగా... 'సెప్టెంబరులో కలుద్దాం' అంటూ ఆయన హింట్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
గతేడాది సెప్టెంబరులో వచ్చిన OG పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ రూ.300 కోట్లకు పైగా రికార్డు కలెక్షన్స్ సాధించింది. సుజీత్ దర్శకత్వం వహించగా... ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మూవీ క్లైమాక్స్‌లోనే సీక్వెల్‌తో పాటు OG యూనివర్స్ కూడా కన్ఫర్మ్ చేశారు. తమన్ బీజీఎం గూస్ బంప్స్ తెప్పించింది.
#OG2 Shoot Starts From September 🌪️🔥
— Milagro Movies (@MilagroMovies) July 7, 2026
:- Music Director @MusicThaman 🐉
#OGUniverse #PawanKalyan pic.twitter.com/xO4thM9Wmm
స్టోరీ చర్చలు ముగిశాయా?
OG సీక్వెల్‌పై ఇప్పటికే పవన్ కల్యాణ్, డైరెక్టర్ సుజిత్ చర్చలు జరిపారు. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి రీసెంట్‌గా దీనిపై అప్డేట్ వచ్చింది. 'ప్రామిస్ నెరవేర్చే దిశగా ప్రయాణం' అంటూ ఇద్దరూ కలిసి మాట్లాడిన ఫోటో షేర్ చేయగా హైప్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం సుజిత్ OG సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా తమన్ కూడా సెప్టెంబరులో కలుద్దాం అంటూ అప్డేట్ ఇవ్వడంతో రాబోయే రెండు నెలల్లోపే పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. 'OG' ఫస్ట్ పార్ట్‌ను DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించగా... సీక్వెల్‌కు మాత్రం నిర్మాత మారనున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై OG2 నిర్మించనున్నట్లు టాక్. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
Also Read : Sing Geetham OTT : ఓటీటీలోకి ముందుగానే సింగ్ గీతం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు























