అన్వేషించండి

OG Collections: 'OG' ప్రీమియర్ రికార్డ్ - ఓవర్సీస్‌లో గ్యాంగ్ స్టర్ కలెక్షన్ల వేట మొదలైంది... వరల్డ్ వైడ్‌గా పవర్ స్టార్ మేనియా

OG Box Office Collections Premier: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'OG' ఓవర్సీస్‌లో అదరగొడతోంది. కేవలం ప్రీమియర్లలోనే రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించింది.

Pawan Kalyan's OG Movie Premier Collections In North America: స్టార్... స్టార్... పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ప్రస్తుతం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు ఇదే. ఎక్కడ చూసిన పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'OG' మేనియానే కనిపిస్తోంది. ఇప్పటివరకూ ఏ స్టార్ హీరోకు రాని విధంగా ఓవర్సీస్‌లో ఒక్క ప్రీమియర్లలోనే రికార్డులు సృష్టించింది. తాజాగా దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఓవర్సీస్‌లో కేవలం ప్రీమియర్లతోనే...

నిజానికి 'OG' టికెట్ బుకింగ్ ఓవర్సీస్‌లో మొదలైనప్పటి నుంచే కలెక్షన్లపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా ఓవర్సీస్ ప్రీమియర్స్‌లో నార్త్ అమెరికాలో 3 మిలియన్ డాలర్లకు (రూ.26 కోట్లకు) పైగా వసూలు చేసిందని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వెల్లడించింది. 'OG కా డిస్ట్రక్షన్' అంటూ ఫైర్ సింబల్స్‌తో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇప్పటివరకూ ఏ స్టార్ హీరోకు కూడా ఈ రికార్డు సొంతం కాలేదని తెలిపింది.కేవలం ప్రీమియర్లలోనే 3 మిలియన్ల డాలర్లు సాధించడం ఇదే ఫస్ట్ టైం అని వెల్లడించింది. ఈ జోష్ రాబోయే రోజుల్లో మరింత కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేసింది.

అయితే, 'ఓజీ' రిలీజ్‌కు  ముందు నార్త్ అమెరికాలో ఓ పెద్ద నిర్మాణ సంస్థ షోలు క్యాన్సిల్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. కానీ మరో ప్రొడక్షన్ హౌస్ మూవీని తీసుకుని ప్రీమియర్ షోస్ వేశారు. దీంతో కలెక్షన్ల పరంగా ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొనగా... రికార్డు క్రియేట్ చేయడం సెన్సేషన్‌గా మారింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by DVV Entertainment (@dvvmovies)

Also Read: 'ఓజీ' సీక్వెల్ ఉందండోయ్... అప్పుడే అయిపోయిందనుకోకు, జపాన్‌లో ఊచకోత!

ఏ మూవీకి రాని విధంగా...

రీసెంట్‌గా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్స్ సాధించిన మూవీస్‌ను మించి ఫస్ట్ డే ప్రీమియర్లలోనే సత్తా చాటింది పవన్ 'OG'. పుష్ప 2 ఓవర్సీస్‌లో ఫస్ట్ డే ప్రీమియర్స్‌లో 10 కోట్ల వసూళ్లు సాధించింది. ఇక ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ 'కల్కి 2' కూడా 3 మిలియన్ డాలర్లు సాధించగా... 'ఓజీ' 3 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. ఓవర్సీస్‌లో కేవలం ప్రీమియర్ కలెక్షన్లే ఈ స్థాయిలో ఉంటే ఇక రాబోయే రోజులు, వీకెండ్స్‌తో ఈ వసూళ్లు సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కలు చూసి మూవీ టీంతో పాటు ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుష్ అవుతున్నారు.

పవర్ ఫుల్ మాస్ ట్రీట్

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా కూడా ప్రస్తుతం 'OG' మేనియా నడుస్తోంది. ప్రీమియర్ల సందర్భంగా అటు అమెరికాలోనూ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద భారీ కటౌట్స్, డ్యాన్సులతో సందడి చేశారు. పవన్ ఫ్యాన్స్ ఆయన్ను సిల్వర్ స్క్రీన్‌పై ఎలా చూడాలని అనుకున్నారో అలానే ప్రెజంట్ చేశారు డైరెక్టర్ సుజీత్. భారీ యాక్షన్ సీక్వెన్స్, పవర్ ఫుల్ స్టైల్ గూస్ బంప్స్ తెప్పించాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా రికార్డుల ఊచకోత మొదలవుతుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Happy Journey OTT : రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన రీసెంట్ కామెడీ ఎమోషనల్ డ్రామా - 'హ్యాపీ జర్నీ' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన రీసెంట్ కామెడీ ఎమోషనల్ డ్రామా - 'హ్యాపీ జర్నీ' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
DNK Movie OTT : ఓటీటీలోకి మౌళి DNK - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి మౌళి DNK - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Anirudh Kavya Maran Wedding : పురోహితులు లేరు... గొలుసులే మార్చుకున్నారు - అనిరుధ్, కావ్య మారన్ సెల్ప్ రెస్పెక్ట్ మ్యారేజ్
పురోహితులు లేరు... గొలుసులే మార్చుకున్నారు - అనిరుధ్, కావ్య మారన్ సెల్ప్ రెస్పెక్ట్ మ్యారేజ్
Ranabaali OTT : ఓటీటీలోకి వచ్చేసిన రణబాలి - విరోష్ కపుల్ కొత్త మూవీ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రణబాలి - విరోష్ కపుల్ కొత్త మూవీ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KA Paul on Revanth Reddy: నాతో చేతులు కలపండి.. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా.. కాంగ్రెస్ నేతలకు కేఏ పాల్ పిలుపు
నాతో చేతులు కలపండి.. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా.. కాంగ్రెస్ నేతలకు కేఏ పాల్ పిలుపు
CM Revanth Reddy: హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో PRTS కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో పీఆర్టీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
Hyderabad Bharat Summit : హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
Why Close Aides Are Leaving YS Jagan: విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
Makhana For Thyroid : థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
AP Municipal Elections 2026: 4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
Expert Opinion: కాలంతో పాటు బైక్‌లు మారుతున్నా సర్వీసింగ్‌ తీరు మారడం లేదు.. ఇంకా మెరుగుపడాలి!
ఖరీదైన, మోడ్రన్‌ బైక్‌లు.. నాసిరకం, పాతకాలపు సర్వీసింగ్! మెకానిక్‌లు మెరుగుపడేది ఎప్పుడు?
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
Embed widget