పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 24న సినిమా థియేటర్లలోకి వస్తోంది. దానికి ముందు పవన్ అభిమానులకు ఇంకో గుడ్ న్యూస్. ఆయన హీరోగా నటిస్తున్న మరో సినిమా 'ఓజీ' అప్డేట్ వచ్చింది. 

'ఓజీ' షూటింగ్ పూర్తి చేసిన పవన్Pawan Kalyan's OG Update: పవర్ ఫుల్ రోల్ 'గంభీర'గా పవన్ కళ్యాణ్ సందడి చేస్తున్న సినిమా 'ఓజీ'. దే కాల్ హిమ్ ఓజీ... పూర్తి టైటిల్. పవన్ ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 'సాహో' ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకం మీద డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యిందని చిత్ర నిర్మాణ సంస్థ అనౌన్స్ చేసింది. పవన్ షూటింగ్ పార్ట్‌ ఎప్పుడో ఫినిష్ అయ్యింది. ఇప్పుడు సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు.

Also Read: సూపర్ మ్యాన్ రివ్యూ: కమల్ 'ఇండియన్ 2'ను గుర్తు చేసే ఆ ఒక్క సీన్... మరి, సినిమా? డీసీ హిట్టు కొట్టిందా?

పవన్ పోస్టర్ చూశారా? బావుంది కదూ!'ఓజీ' షూటింగ్ కంప్లీట్ అయ్యిందని అనౌన్స్ చేసిన సందర్భంగా డీవీవీ సంస్థ ఒక పోస్టర్ విడుదల చేసింది. కారు దిగిన గంభీర, వర్షంలో తడుస్తూ గన్‌తో ఫైర్ చేస్తున్న పవన్ కళ్యాణ్ పోస్టర్ అదిరిపోయిందని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం 'ఓజీ' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సెప్టెంబర్ 25, 2025న  ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Also Readబాహుబలి @ 10 - తెర వెనుక సమ్‌గతుల నుంచి రికార్డ్స్‌, అవార్డ్స్‌ వరకూ... ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌ తెలుసా?

OG Movie Cast And Crew: పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంకా అరుల్ మోహన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ విలన్. ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రవి కె చంద్రన్ - మనోజ్ పరమహంస, కూర్పు: నవీన్ నూలి, సంగీతం: తమన్.