Pranav Kaushik's Youthful Entertainer Patang Trailer Out Now : న్యూ యాక్టర్స్... సరికొత్త లవ్ స్టోరీతో రాబోతోన్న యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ 'పతంగ్'. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రైలర్ ఎలా ఉందంటే?
ఈ మూవీలో లవ్ ట్రాక్‌కు 'పతంగ్' కీ రోల్ ప్లే చేయనున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. 'పురాణాల్లో చూసుకుంటే సీత కోసం కాంపిటీషన్‌లో చాలా మంది పార్టిసిపేట్ చేశారు కదా...' అంటూ ఓ తండ్రితో కూతురు చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. 'నువ్వు ఈ పురాణాల రిఫరెన్సులు ఆపు' అంటూ తండ్రి చెబుతాడు. కొత్త వారితో సరికొత్త ట్రయాంగిల్ లవ్ స్టోరీ తెరకెక్కించినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.
ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్, ప్రీతి పగడాలతో పాటు ఎస్పీ చరణ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ సైతం కీలక పాత్రలు పోషించారు. ప్రవీణ్ ప్తత్తిపాటి దర్శకత్వం వహించగా... దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్, నాని బండ్రెడ్డి నిర్మించారు.