Panchali Panchabhartruka: అప్పటి రాజేంద్ర ప్రసాద్‌ను చూస్తారు... 'పాంచాలి పంచభర్తృక'పై నటకిరీటి ధీమా
Rajendra Prasad New Movie: ట్రెండీ కామెడీతో నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కొత్త సినిమా 'పాంచాలి పంచభర్తృక' విడుదలకు సిద్ధమైంది. ఇందులో ఫేమస్ ర్యాపర్ రోల్ రైడా హీరో.

పాంచాలి పంచభర్తృక... తెలుగు ప్రేక్షకులకు ఈ డైలాగ్ బాగా తెలుసు. 'దాన వీర శూర కర్ణ'లో ద్రౌపది పాత్రను ఉద్దేశిస్తూ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామరావు చెప్పిన పాపులర్ డైలాగ్. ఇప్పుడు ఆ డైలాగు టైటిల్‌గా... 'పాంచాలి పంచభర్తృక' పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. అందులో నటకిరీటి డా రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ ర్యాప్ సింగర్ రోల్ రైడా హీరోగా నటిస్తున్నారు. ట్రెండీ కామెడీతో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ 'పాంచాలి పంచభర్తృక' గురించి రాజేంద్ర ప్రసాద్ ఏం చెప్పారంటే...
అప్పటి నటకిరీటిని చూస్తారు
''ఈ మధ్య కాలంలో నాకు ఇటువంటి మంచి క్యారెక్టర్ రావడం చాలా అరుదు. ఈ సినిమాలో పాట, ఫైటులతో ప్రేక్షకులను అలరిస్తాయి. మళ్ళీ మీరు అప్పటి రాజేంద్ర ప్రసాద్‌ను చూస్తారు'' అని నటకిరీటి అన్నారు. ''నేను ఈ సినిమాలో హీరోగా చేశారు. తొలిసారి ఇటువంటి పాత్రలో కనిపించబోతున్నాను. సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు నవ్వుతూ చూస్తారు. ప్రేక్షకులకు మంచి ఫన్ ట్రీట్ ఈ సినిమా'' అని రాప్ సెన్షేషన్ రోల్ రైడా చెప్పారు.
'పాంచాలి పంచభర్తృక' చిత్రాన్ని రోయల్ థ్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయిరాం ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో, రోల్ రైడా హీరోగా నటించారు. రాజ్ పవన్, వెంకట్ దుగ్గిరెడ్డి యూఎస్ఏ నిర్మాతలు. గంగ సప్తశిఖర దర్శకత్వం వహించారు. ట్రెండీ కామెడీతో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని, ఇటీవల విడుదల చేసిన రెట్రో స్టైల్ సాంగ్ 'సెనోరిటా రాసిస్తా నా ఆస్తి నీ పేరిట'కు మంచి స్పందన లభించడంతో పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యిందని దర్శక నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.
"హెల్దీ కామెడీ చిత్రమిది. మంచి కామెడీ రాయడం ఒక ఎత్తు అయితే ఆ టైమింగ్‌లో నటించడం మాకు సవాలే" అని మరొక హీరో 'జెమినీ' సురేష్ చెప్పారు. ''సెటిల్డ్ కామెడీతో మెప్పించడం కొత్త నటుడిగా నాకు ఒక పరీక్ష'' అని హీరోగా పరిచయం అవుతున్న రాజ్ పవన్ అన్నారు. "నెల్లూరు యాసలో కామెడీ చేయడం నాకు సూటయ్యే పాత్ర. ఇటువంటి పాత్రల్లో నటించినప్పుడు మనలో ఉన్న అసలు నటుడు బయటికు వస్తాడు. ప్రేక్షకులను మెప్పిస్తాడు" అని హీరోల్లో ఒకరైన వెంకట్ దుగ్గిరెడ్డి యూఎస్ఏ చెప్పారు. చిత్ర నిర్మాణంలో రాజీ పడకుండా క్వాలిటీ ఫిల్మ్ తీశామని, సహ నిర్మాతలు శ్రీకాంత్ శెట్టివారి & సాయినాథ్ మన్యం సహకారాలు మరువలేనివని చిత్ర నిర్మాతల్లో ఒకరైన రాజ్ పవన్ తెలిపారు.
Also Read: Rashmika Marriage - 'సు ఫ్రమ్ సో' దర్శకుడితో రష్మిక పెళ్లి... ఫోటోలు వైరల్
రాజేంద్ర ప్రసాద్, 'జెమినీ' సురేష్, రోల్ రైడా, రాజ్ పవన్, వెంకట్ దుగ్గిరెడ్డి యూఎస్ఏ, సారెహ్ ఫార్, ప్రిథ్వీరాజ్, రూపాలక్ష్మి, శ్రీకాంత్ అయ్యంగార్, రవి రెడ్డి, అనక తదితరులు నటించిన 'పాంచాలి పంచభర్తృక' చిత్రానికి కూర్పు: జానీ బాషా - నాగ నల్లగొండ, సంగీతం: మహేష్ నారాయణ - బిషేక్ - రోల్ రైడా, నవనీత్ చారి (అడిషనల్ మ్యూజిక్), ఛాయాగ్రహణం: ప్రసాద్ కెవి, కథ: బాబీ కెఎస్ఆర్, స్క్రీన్ ప్లే: రాజ్ పవన్, మాటలు - దర్శకత్వం: గంగ సప్తశిఖర.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















