Family Star OTT Release Date and Streaming Update: 'రౌడీ' హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), మరాఠి బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించి చిత్రం 'ఫ్యామిలీ స్టార్‌' (Family Star OTT Update). డైరెక్టర్‌ పరశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్‌ 5న థియేటర్లోకి వచ్చింది. ఆరేళ్ల క్రితం వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'గీతా గోవిందం' బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. మళ్లీ ఇదే కాంబినేషన్‌ రిపీట్ కావడంతో మూవీపై బజ్‌ క్రియేట్‌ అయ్యింది. అలా ఎన్నో అంచనాలతో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించిన అన్ని వర్గాల ఆడియన్స్‌ని మాత్రం ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్న ఫ్యామిలీ స్టార్‌ ఇప్పుడు డిజిటల్‌ ప్రిమియర్‌కి రెడీ అయ్యింది. సైలెంట్‌గా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకుంది.


అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోంది


Family Star OTT Release Date: తాజాగా దీనిపై సదరు ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్‌ ప్రైం దక్కించుకుంది. డిసెంట్‌ రేట్‌కు ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ అమ్ముడైనట్టు సమాచారం. దీంతో థియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమాను ఇప్పుడు 20రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నారు. ఏప్రిల్‌ 26 నుంచి ఈ మూవీ అమెజాన్‌లో ప్రిమియర్‌కు రాబోతుంది. తాజాగా దీనిపై ప్రకటన ఇస్తూ స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది అమెజాన్‌ ప్రైం. దీంతో థియేటర్లోని చూడలేని వారు ఫ్యామిలీ స్టార్‌ ఓటీటీలో చూసేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. తెలుగులోనే కాదు మిగిలిన దక్షణాది భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. మరి ఓటీటీలో ఈమూవీ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. అయితే'ఫ్యామిలీ స్టార్' రిలీజ్ డే మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. క్రిటిక్స్ రివ్యూస్ కూడా గొప్పగా రాలేదు.



ఫ్యామిలీ స్టార్ తో రూ. 200 కోట్లు కొడతా..


కానీ ఫ్యామిలీలకు మూవీ నచ్చిందని 'దిల్ ' రాజు చెప్పుకొచ్చారు. ఫెస్టివల్ హాలిడేస్ ఉండటంతో లాస్ట్ వీక్ ఉగాది, రంజాన్ రోజుల్లో కలెక్షన్స్ కుమ్మేసింది 'ఫ్యామిలీ స్టార్'. ఆ తర్వాత డౌన్ అవ్వడంతో ఓటీటీలోకి ఎర్లీగా వచ్చేసింది. నిజానికి ఫ్యామిలీ స్టార్‌ హిట్‌ విజయ్‌ దేవరకొండ క్రూషియల్‌ అనే చెప్పాలి. 'లైగర్‌', 'ఖుషి' చిత్రాలతో వరుసగా ప్లాప్స్‌ చూస్తున్న విజయ్‌ ఫ్యామిలీ స్టార్‌తో అయినా భారీ హిట్‌ కొట్టాలని ఆశపడ్డాడు. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లోనూ అదే కాన్ఫిడెన్స్‌ చూపించాడు. ఫ్యామిలీ స్టార్‌ సినిమా రూ. 200 కోట్లు కొడతానంటూ యాటిట్యూడ్‌ చూపించాడు. దీంతో మరోసారి విజయ్‌ని ట్రోల్‌. లైగర్‌ టైంలో చేసిన పొరపాటే ఫ్యామిలీ స్టార్‌కు చేశాడని, ఈ ఓవర్‌ కాన్పిడెన్స్‌ వల్లే ప్లాప్స్‌ చూస్తున్నాడంటూ క్రిటిక్స్ విజయ్‌ని విమర్శించారు. 


Also Read: 'జాతి రత్నాలు' to 'టిల్లు స్క్వేర్'... కామెడీ కాదు, కోవిడ్ తర్వాత కోట్లు కొల్లగొట్టిన పైసా వసూల్ ఫార్ములా