Allu Sirish Buddy OTT Release and Streaming Date Fix: అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తనయడిగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడిగా ఇండస్ట్రీలో హీరో అడుగుపెట్టాడు అల్లు శిరీష్. కానీ, హీరోగా అతడి కెరీర్ ఆశించిన విధంగా లేదని చెప్పాలి. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలతో వస్తున్నా ఆమె పెద్దగా ఆదరణ పొందడం లేదు. చివరిగా 'ఏబీసీడీ', 'ఊర్వశివో రాక్షసివో' సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మారాయి. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న శిరీష్ సరికొత్త కాన్సెప్ట్‌తో బడ్డీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ముందు నుంచి ఈ మూవీ విడుదల విషయంలో ఆటంకాలు ఎదురయ్యాయి. ఎట్టకేలకు ఈ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. కానీ, ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ అందుకోలేకపోయింది. థియేటర్లో విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాకు ప్రేక్షకాదరణ లేకపోవడంతో తక్కువ టైంలోనే థియేటర్ల నుంచి వెనుతిరిగింది. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అయ్యింది. అది కూడా విడుదలైన నెల రోజుల లోపే ఈ సినిమా ఓటీటీకి వస్తుండటం గమనార్హం.
ఆ రోజు నుంచి స్ట్రీమింగ్
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ బడ్డీ ఓటీటీ రైట్స్‌ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఓటీటీ ఢిల్ జరిగింది. థియేట్రికల్ రిలీజ్ ముందే బడ్డీని డిజిటల్ రైట్స్ దక్కించుకున్నట్టు నెట్‌ఫ్లిక్స్ ప్రకటన కూడా ఇచ్చేసింది. మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యింది. దీంతో ఒప్పందం ప్రకారం బడ్డీని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ సిద్ధమైంది. ఆగస్టు 30వ తేదీని నుంచి ఈ సినిమాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు తాజాగా ప్రకటన ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్. కాగా మూవీ విడుదటైన నెల రోజుల లోపే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ వస్తుండటంతో డిజిటల్ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సరికొత్త కథతో
శామ్ ఆంటోన్ దర్శకత్వంలో యాక్షన్ ప్యాకెడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా 'బడ్డీ' సినిమా తెరకెక్కింది. ఇందులో శిరీష్ సరసన గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేష్ సింగ్‌లు హీరోయిన్లుగా నటించారు. అజ్మల్ అమీర్ కీలక పాత్ర పోషించగా.. ముఖేష్ కుమార్, కమెడియన్ అలీ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాలో ఒక టెడ్డీ బేర్ కీలక పాత్రలో కనిపించడంతో మూవీపై అంచనాలు నెలకొన్నాయి. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మించారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించిన ఈ చిత్రానికి కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరించారు. ప్రముఖ డీవోపీ ఆర్ సెంథిల్ టెడ్డీకి ఆర్ట్ డైరెక్టర్ గా, రూబెన్ ఎడిటర్ గా వర్క్ పనిచేశారు.
Also Read: నేను సెలబ్రిటీ మాత్రమే - పబ్లిక్ ప్రాపర్టీని కాదు - ఫోటోగ్రాఫర్లతో గొడవపై స్పందించిన తాప్సీ