అకాడమీ అవార్డుల 98వ ఎడిషన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక కోసం పాపులర్ డాల్బీ థియేటర్‌లో జరగనుంది. మార్చి 15న ఈవెంట్... హాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఆస్కార్ 2026 అవార్డులను భారత దేశంలో ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చో తెలుసుకోండి.

ఆస్కార్ 2026కి హోస్ట్ ఎవరు? 98వ అకాడమీ అవార్డులు లేదా ఆస్కార్ అవార్డులు 2026 కార్యక్రామానికి కోనన్ ఓ'బ్రియన్ హోస్ట్. ఈ కార్యక్రమం ఆదివారం (మార్చి 15, 2026న - ఆదివారం) లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియాలోని ఓవేషన్ హాలీవుడ్‌లో ఉన్న పాపులర్ డాల్బీ థియేటర్‌లో నిర్వహిస్తారు. అక్కడ టైం ప్రకారం... ఈ వేడుక సాయంత్రం 7 గంటలకు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

మన దేశంలో ఎప్పుడు చూడవచ్చు? భారతీయ ప్రేక్షకులు ఆస్కార్ అవార్డులు 2026 వేడుకను సోమవారం ఉదయం (మార్చి 16, 2026న) 4:30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. రెడ్ కార్పెట్ ఉదయం దాదాపు 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. లైవ్ ప్రసారం చూడలేని వారి కోసం సోమవారం సాయంత్రం 9:00 గంటలకు తిరిగి ప్రసారం చేస్తారు.

Also ReadJason Sanjay: దళపతి విజయ్‌కు షాక్ ఇవ్వబోతున్న కొడుకు... జాసన్ సంజయ్ అంత పని చేస్తాడా?

భారతయ ప్రేక్షకులు ఎక్కడ చూడవచ్చు?

  • భారతీయ ప్రేక్షకులకు ఆస్కార్ వేడుకను చూడటానికి బోలెడు ఛాయిస్‌లు ఉన్నాయి.
  • JioHotstarలో ప్రత్యక్ష ప్రసారం ‌కానుందీ వేడుక. అలాగే, ఆన్ - డిమాండ్ రీప్లే కూడా చూడవచ్చు.
  • టెలివిజన్‌ ప్రసారం విషయానికి వస్తే... ఈ అవార్డుల వేడుకను స్టార్ మూవీస్, స్టార్ మూవీస్ సెలెక్ట్, కలర్స్ ఇన్ఫినిటీలో ప్రసారం చేయనున్నారు.
  • భారతీయ ప్రేక్షకులకు ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ ఈ వేడుకలో చాలా మంది హాలీవుడ్ నటీనటులతో కలిసి ప్రజెంటర్లలో ఒకరిగా ఉంటారు.

Also ReadTrisha: ఎయిర్ పోర్టులో త్రిష... మీడియా ప్రశ్నల వర్షం - సౌత్ క్వీన్ ఏం చెప్పారంటే?

ఆస్కార్ 2026లో అత్యధిక నామినేషన్లు ఎవరికి వచ్చాయి?ఆస్కార్ రేసులో పలు సినిమాలు ఉన్నాయి. ఈసారి... 98వ అకాడమీ అవార్డులలో 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్', 'సినర్స్' చాలా నామినేషన్లను పొందాయి. పాల్ థామస్ ఆండర్సన్ సినిమా 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' దాదాపు 13 నామినేషన్లను పొందింది. అయితే... రియాన్ కూగ్లర్ సినిమా 'సినర్స్' 16 నామినేషన్లను సాధించి చరిత్ర సృష్టించింది.  ఆస్కార్ రేసులో కొత్త రికార్డును నెలకొల్పింది.

Also ReadAllu Cinemas: అల్లు సినిమాస్ స్పెషాలిటీ ఏమిటి? 'డాల్బీ సినిమా' స్క్రీన్‌లో పిక్చర్ ఎందుకు చూడాలంటే?