మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు (Man Of Masses NTR Birthday) అంటే అభిమానులకు పండుగ. ఆ రోజు మరింత స్పెషల్ చేసేందుకు ఆయన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన 'ఊసరవెల్లి' (Oosaravelli Movie) టీం రెడీ అవుతోంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆ సినిమా స్పెషల్ షోస్ ప్లాన్ చేశారు.

మే 20న 'ఊసరవెల్లి' స్పెషల్ షోస్!Oosaravelli Special Shows On NTR Birthday: ఎన్టీఆర్ సినిమాల్లో 'ఊసరవెల్లి'కి స్పెషల్ ప్లేస్ ఉంది. అందులో ఎన్టీఆర్ స్టైల్ బావుంటుంది. మాస్ కమర్షియల్ సినిమాల నుంచి కాస్త పక్కకు జరిగి... అభిమానులు కోరుకునే యాక్షన్, మంచి స్టోరీతో పాటు స్టైలిష్ సినిమా అందించారు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను మే 20న రీ రిలీజ్ ప్లాన్ చేశారు. ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో స్పెషల్ షోస్ వేయనున్నారు.

Also ReadKara First Review: కర ఫస్ట్ రివ్యూ... ధనుష్ సినిమా గురించి జీవీ ప్రకాష్ ఏమన్నారంటే?

ఎన్టీఆర్ 'డ్రాగన్' నుంచి అప్డేట్...!NTR Upcoming Movies: ప్రజెంట్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా 'డ్రాగన్'. ఆ టైటిల్ ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. బహుశా... మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయ్. లేదంటే సినిమా నుంచి మరొక అప్డేట్ కూడా రావచ్చు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ చేయనున్నారు. 'కేజీఎఫ్', 'సలార్' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. 

Also ReadMamitha Baiju: హీరోకి 42 ఏళ్ళు... మమితకు 24 ఏళ్ళు... ధనుష్ 'కర' విషయంలోనూ

'డ్రాగన్' కాకుండా మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ దర్శకత్వంలో మరొక పాన్ ఇండియా సినిమా చేయనున్నారు ఎన్టీఆర్. కుమారస్వామి నేపథ్యంలో ఆ సినిమా రూపొందనుంది. 'గాడ్ అఫ్ వార్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమా కంటే ముందు విక్టరీ వెంకటేష్ హీరోగా 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47' సినిమా పూర్తి చేయనున్నారు త్రివిక్రమ్. ఎన్టీఆర్ హీరోగా సినిమాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఏం అవుతుందో చూడాలి. 

Also ReadElli AvrRam Viral Beer Video: లగెత్తరో ఆజాము... కెమెరాలు కనిపించడంతో బీరు బాటిల్‌తో హీరోయిన్ పరార్