పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటించిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'ఓజీ' (OG Movie). సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అమెరికాలో 24వ తేదీ నుంచి ప్రీమియర్ షోలు షెడ్యూల్ చేశారు. ఏపీ రాష్ట్రంలోనూ అర్ధరాత్రి నుంచి బెనిఫిట్ షోలు వేయడానికి ప్లాన్ చేశారు. అలాగే టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా ఏపీ ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది. బెనిఫిట్ షోస్ ఏ టైం నుంచి పడతాయి? ఆ షో టికెట్ రేటు ఎంత? తర్వాత నుంచి టికెట్ రేటు ఎంత పెంచుకోవడానికి అనుమతి వచ్చింది? అనేది చూస్తే...

Continues below advertisement

ఒంటి గంట నుంచి బెనిఫిట్ షోలు...ఒక్కో టికెట్ రేటు వెయ్యి రూపాయలుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'ఓజీ' సినిమా బెనిఫిట్ షో టికెట్ రేటు 1000 రూపాయలకు విక్రయించడానికి అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 25వ తేదీ 1am... అంటే 24వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట నుంచి బెనిఫిట్ షో ప్రదర్శించడానికి అనుమతి ఇచ్చింది.

సినిమా రిలీజ్ డే సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు పది రోజుల‌ పాటు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలుపుకొని టికెట్ రేటు మీద 125 రూపాయలు పెంచుకోవచ్చని తెలిపింది. అలాగే మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 150 రూపాయలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న టికెట్ రేటు మీద ఈ పెంపు వర్తిస్తుంది.

Continues below advertisement

Also Readఆ హీరోకి 'మిరాయ్'లో విలన్ ఛాన్స్ మిస్... మనోజ్ మంచుకు ముందు ఆప్షన్ ఎవరో తెలుసా?

తెలంగాణ ప్రభుత్వం హైక్ ఇస్తుందా?హైదరాబాద్ సిటీలో బెనిఫిట్ షో ఉంటుందా?సంధ్య థియేటర్ దగ్గర 'పుష్ప 2' ప్రీమియర్ షో ప్రదర్శించిన సమయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా ఒక మహిళ మృతి చెందడం వల్ల తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం నిరాకరించింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ 'ఓజీ' చిత్రానికి టికెట్ రేట్ హైక్ లభిస్తుందా? లేదా? అని డిస్ట్రిబ్యూషన్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. 

'ఓజీ'కి బెనిఫిట్ షోలతో పాటు టికెట్ రేట్ హైక్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సుముఖంగానే ఉన్నట్లు ఫిలింనగర్ విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

Also Readలోకేష్‌ను పక్కన పెట్టిన రజనీకాంత్...? చెన్నైలో సస్పెన్స్ పెంచిన సూపర్ స్టార్!

'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ?ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు? ఫ్యాన్స్ వెయిటింగ్!OG Trailer Release Date: 'ఓజీ' ట్రైలర్ ఎప్పుడు విడుదల చేస్తామనేది సెప్టెంబర్ 18న డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అనౌన్స్ చేయనుంది.‌ అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి కూడా ఒక అప్డేట్ ఇవ్వనుంది. 

'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య, ఆయన తనయుడు దాసరి కళ్యాణ్ ప్రొడ్యూస్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుణ్ మోహన్ కథానాయికగా నటించారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేశారు. అర్జున్ దాస్, శ్రియ రెడ్డి, హరీష్ ఉత్తమన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఆయన ఇచ్చిన ప్రతి పాట చార్ట్ బస్టర్ అయింది. సినిమాపై అంచనాలు పెంచింది.