అన్వేషించండి

O Romeo Movie Controversy: మా నాన్న గ్యాంగ్‌స్టర్ కాదు... జర్నలిస్ట్ - షాహిద్ 'ఓ రోమియో'పై కోర్టుకు వెళ్లిన లేడీ

O Romeo Movie Release Date: ఫిబ్రవరి 13న విడుదల కానున్న బాలీవుడ్ సినిమాల్లో షాహిద్ కపూర్ 'ఓ రోమియో' ఒకటి. ఈ సినిమా మీద ఒకరు కోర్టుకు వెళ్లారు. ఆ వివాదం ఏమిటో తెలుసుకోండి.

ఫిబ్రవరి 13న విడుదల కానున్న బాలీవుడ్ సినిమా 'ఓ రోమియో'. ఇందులో షాహిద్ కపూర్ హీరో. 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్ సింగ్'తో ఆయన భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తరహా హిట్ 'ఓ రోమియో' వస్తుందని హిందీ ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి. అయితే... సినిమా విడుదలకు ముందు చిత్ర బృందానికి షాక్ తగిలింది. ఈ సినిమా మీద ఒకరు కోర్టుకు వెళ్లారు. ఆ వివాదం, పూర్తి వివరాల్లోకి వెళితే... 

'ఓ రోమియో' సినిమా విడుదలకు వ్యతిరేకంగా హుస్సేన్ 'ఉస్త్రా' షేక్ కుమార్తె సనోబర్ షేక్ కోర్టుకు వెళ్లారు. ఫిబ్రవరి 2వ తేదీన బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా & 'ఓ రోమియో' విడుదలకు వ్యతిరేకంగా శాశ్వత నిషేధం (ఇంజంక్షన్) కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమాలో తన తండ్రి జీవితాన్ని వక్రీకరించారని ఆమె ఆరోపించారు.

ఏబీపీ న్యూస్‌తో సనోబర్ షేక్ మాట్లాడుతూ... చిత్ర నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా, దర్శకుడు విశాల్ భరద్వాజ్, జర్నలిస్ట్ - రైటర్ హుస్సేన్ జైదీలపై సివిల్ కోర్టులో కేసు దాఖలు చేసినట్లు సనోబర్ షేక్ తెలిపారు.

'ఓ రోమియో' సినిమాలో అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించారని సనోబర్ షేక్ ఆరోపించారు. అంతే కాదు... ముంబైలోని జె.జె. మార్గ్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఆమె ఫిర్యాదు చేశారు. ఈ సినిమాలో షాహిద్ కపూర్ 'ఉస్త్రా' పాత్ర పోషిస్తున్నారు. హుస్సేన్ జైదీ రాసిన 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

Also ReadWith Love Movie Review - 'విత్ లవ్' రివ్యూ: పెళ్లి చూపులు నుంచి మాజీ ప్రేమికుల దగ్గరకు... సౌందర్య రజనీకాంత్ నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?

O Romeo Movie Controversy: మా నాన్న గ్యాంగ్‌స్టర్ కాదు... జర్నలిస్ట్ - షాహిద్ 'ఓ రోమియో'పై కోర్టుకు వెళ్లిన లేడీ

తన తండ్రి కథతో 'ఓ రోమియో' తీశారని, ఆయనను 'గ్యాంగ్‌స్టర్'గా చూపించారని సనోబర్ షేక్ ఆరోపించారు. తన తండ్రి గ్యాంగ్‌స్టర్ కాదని, అండర్‌ వరల్డ్‌ను అంతం చేయడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు పోలీసులకు బోల్డంత సమాచారం అందించిన జర్నలిస్ట్ అని ఆమె స్పష్టం చేశారు. తన తండ్రి ప్రెస్ ID కార్డును చూపించడంతో పాటు ఆధారాలు సమర్పించారు.

Also Read: Shalini Pandey: బికినీలో షాక్ ఇచ్చిన బ్యూటీ... మరోసారి 'అర్జున్ రెడ్డి' బ్యూటీ సెన్సేషనల్ పోస్ట్

O Romeo Movie Controversy: మా నాన్న గ్యాంగ్‌స్టర్ కాదు... జర్నలిస్ట్ - షాహిద్ 'ఓ రోమియో'పై కోర్టుకు వెళ్లిన లేడీ

'ఓ రోమియో' సినిమా విడుదల అయితే తమ కుటుంబానికి, తమ పిల్లలకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని సనోబర్ షేక్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 11, 1998న హుస్సేన్ ఉస్త్రాను చోటా షకీల్ ముఠా హత్య చేసిందని, తన తండ్రి శరీరంలో 11 బుల్లెట్లు ఉన్న సంగతి గుర్తుంచుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆమె ఆరోపణలను సాజిద్ నడియాడ్‌వాలా, విశాల్ భరద్వాజ్ ఖండించారు. తమ సినిమా పూర్తిగా కల్పిత కథతో రూపొందిందని చెప్పారు. ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానున్న 'ఓ రోమియో' సినిమాలో షాహిద్ కపూర్, తృప్తి డిమ్రి, నానా పటేకర్, అవినాష్ తివారీ, తమన్నా భాటియా, దిశా పటాని, ఫరీదా జలాల్, విక్రాంత్ మెస్సీ ప్రధాన పాత్రల్లో నటించారు.

Also ReadBarabar Premistha Controversy: బూతు పాటపై విమర్శలు... వెనక్కి తగ్గని యాటిట్యూడ్ స్టార్... అసలు ఏంటీ బరాబర్ కాంట్రవర్సీ?

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Trisha Vs Parthiban: తప్పు... తప్పుడు పని... త్రిషకు సారీ చెబుతూ సెటైర్ వేసిన పార్తీబన్
తప్పు... తప్పుడు పని... త్రిషకు సారీ చెబుతూ సెటైర్ వేసిన పార్తీబన్
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో ఫస్ట్ మీటింగ్... కారులో ఆరు గంటలు వెయిట్ చేసిన డైరెక్టర్
పవన్ కళ్యాణ్‌తో ఫస్ట్ మీటింగ్... కారులో ఆరు గంటలు వెయిట్ చేసిన డైరెక్టర్
Dhurandhar 2: 'ధురంధర్ 2' ట్రైలర్ రికార్డ్... రెండు రోజుల్లో హిస్టరీ!
'ధురంధర్ 2' ట్రైలర్ రికార్డ్... రెండు రోజుల్లో హిస్టరీ!
Ritu Varma: రీతూ వర్మ కొత్త అవతార్: గోపీచంద్ 33లో సత్యవతిగా... ఫస్ట్ లుక్ చూశారా?
రీతూ వర్మ కొత్త అవతార్: గోపీచంద్ 33లో సత్యవతిగా... ఫస్ట్ లుక్ చూశారా?
Advertisement

వీడియోలు

Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel-Iran War: గ్యాస్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం! సప్లై కోసం ప్రయార్టీ జాబితా సిద్ధం!
గ్యాస్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం! సప్లై కోసం ప్రయార్టీ జాబితా సిద్ధం!
Andhra Pradesh Liquor Scam: లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
US Israel Iran War:
"ప్రధాని మోదీ ఒక ఫోన్ కాల్ చేస్తే యుఎస్-ఇరాన్ యుద్ధం ఆగిపోతుంది" యుఎఇపై మాజీ రాయబారి కామెంట్స్ 
Kavitha Arrest: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Sai Pallavi: సాయి పల్లవి మిర్రర్ సెల్ఫీలు... డ్రస్‌ల గురించి ఏం చెప్పిందంటే?
సాయి పల్లవి మిర్రర్ సెల్ఫీలు... డ్రస్‌ల గురించి ఏం చెప్పిందంటే?
బుల్ బార్‌లపై కేంద్రం నిషేధం - మీ కారుకు ఉంటే వెంటనే తీసేయండి, లేదంటే ఫైన్ తప్పదు
మీ కారుకు బంపర్ గార్డ్ ఉందా? జాగ్రత్త, రూ.5,000 వరకు జరిమానా పడొచ్చు!
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Embed widget