మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. ట్రైలర్ విడుదల నుంచి సందడి మొదలు అవుతుంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న 'వార్ 2' (War 2)కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ నెలకొందంటే కారణం ఎన్టీఆర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు 'వార్ 2' ట్రైలర్ విడుదల (War 2 Trailer Launch) విషయంలోనూ తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ప్లాన్ చేశారు.
108 థియేటర్లలో 'వార్ 2' ట్రైలర్ స్క్రీనింగ్'వార్ 2'ను తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ అంటే ఆయనకు గౌరవం, అలాగే ప్రత్యేకమైన అభిమానం. 'దేవర'ను సైతం తెలుగు రాష్ట్రాల్లో ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు. తెలుగుతో కంపేర్ చేస్తే బాలీవుడ్ సినిమా ప్రమోషనల్ స్ట్రాటజీస్ కాస్త భిన్నంగా ఉంటాయి. తెలుగునాట ఎన్టీఆర్ క్రేజ్ వేరు, ఆయన సినిమా అంటే ఆడియన్స్ - ఫ్యాన్స్ ఆశించే ఈవెంట్స్ వేరు. అందుకని, 108 థియేటర్లలో 'వార్ 2' ట్రైలర్ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. అవి ఏయే థియేటర్లు అనేది ఈ కింద లిస్టులో చూడండి.
Also Read: ఏపీలో 'కింగ్‌డమ్' టికెట్ రేట్స్ పెరిగాయ్... ఎంతంటే? సేఫ్ గేమ్ ఆడిన విజయ్ దేవరకొండ?
జూలై 25న 'వార్ 2' ట్రైలర్ విడుదల ఎందుకు?Why War 2 trailer releasing on July 25th?: జూలై 25న 'వార్ 2' ట్రైలర్ విడుదల చేయడానికి గల కారణం ఏమిటో తెలుసా? సినిమాలో హీరోలు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కెరీర్ స్టార్ట్ చేసి ఈ ఏడాదితో 25 సంవత్సరాలు అవుతోంది. అందుకని, జూలై 25న ట్రైలర్ విడుదల చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం ఉదయం 9.30 గంటల నుంచి 'వార్ 2' హంగామా మొదలు కానుంది.
Also Read: యుద్ధభూమికి వీరమల్లు... క్లైమాక్స్‌లో సెకండ్ పార్ట్ టైటిల్ రివీల్... అది ఏమిటో తెలుసా?
War 2 Release Date: అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ 'వార్ 2' ప్రొడ్యూస్ చేసింది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్. హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లో ఆగస్టు 14న సినిమా విడుదల కానుంది.