'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ హంగామా చూస్తుంటే తారక్ అన్న (ఎన్టీఆర్)ను హిందీ సినిమాకు తీసుకు వెళుతున్నట్టు లేదని... హృతిక్ రోషన్ గారిని తెలుగు సినిమాకు తీసుకు వస్తున్నట్టు ఉందని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత, నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారు. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌ ఫ్రాంచైజీలో భాగంగా యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసిన 'వార్ 2'ను తెలుగు రాష్ట్రాల్లో ఆయన విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ (War 2 Pre Release Event)లో సినిమా ఎవరినీ డిజప్పాయింట్ చేయదని నాగవంశీ తెలిపారు. 

ప్రోపర్ తెలుగు సినిమాలా ఉంటుంది!హిందీ డబ్బింగ్ సినిమా తరహాలో 'వార్ 2' ఉండదని, ప్రోపర్ తెలుగు సినిమా అన్నట్టు ఉంటుందని నాగవంశీ చెప్పారు. లిప్ సింక్ సహా ప్రతిదీ అంత పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్పారు. 

''థియేటర్ల నుంచి 'వార్ 2' చూసి బయటకు వచ్చేటప్పుడు అయాన్ ముఖర్జీ గారు తెలుగు దర్శకులు ఇప్పటి వరకు తారక్ అన్నను చూపించిన దానికంటే బాగా చూపించారని మీరే (ప్రేక్షకులు) గర్వంగా ఫీలవుతారు. మనం హృతిక్ రోషన్ గారిని తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వాగతిస్తున్నట్టు సినిమా ఉంటుంది'' అని నాగవంశీ అన్నారు. 

'దేవర' కంటే పదింతలు ఓపెనింగ్ రావాలి! గతేడాది సెప్టెంబర్ 27న 'దేవర' మీద చూపించిన ప్రేమకంటే పదింతలు ఎక్కువ ప్రేమ 'వార్ 2' మీద అభిమానులు చూపించాలని నాగవంశీ కోరారు.

Also Read: కటౌట్స్ కాదు... మాస్ మూమెంట్స్ - 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హంగామా

''గుర్తు పెట్టుకోండి... తారక్ అన్న పవర్ ఇండియా అంతా తెలియాలంటే సెప్టెంబర్ 27 కంటే పదింతలు ఎక్కువ ప్రేమ చూపించాలి. హిందీ బాక్సాఫీస్ నెట్ ఎంత ఉంటుందో దాని కంటే ఒక్క రూపాయి నెట్ మనం ఎక్కువ పెట్టాలి. 'దేవర' కంటే పదింతలు ఎక్కువ ఓపెనింగ్ తీసుకు రావాల్సిన బాధ్యత అభిమానులది. మన కోసం అన్న కాలర్ ఎగరేశారు. ఇప్పుడు అన్నయ్య ఇండియాలో కాలర్ ఎగరేసేలా చేయాలి'' అని నాగవంశీ మాట్లాడారు. సినిమా చూసి బాగా వచ్చిందని, సినిమా చూశాక ఎవరూ డిజప్పాయింట్ అవ్వరని, షాక్ అవుతారని, అద్భుతమైన తెలుగు సినిమా చూశామని అనిపించకపోతే ఇంకెప్పుడూ మైక్ పట్టుకుని సినిమా చూడమని అడగనని ఆయన తెలిపారు.   

త్రివిక్రమ్, ఎన్టీఆర్ ముందు నాకు భయం!స్పీచ్ స్టార్ట్ చేయడానికి ముందు తనకు గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముందు మాట్లాడాలంటే భయమని నాగవంశీ తెలిపారు. ''అసలు ప్రపంచంలో ఎవరైతే ఇద్దరి ముందు నోటి లోనుంచి మాట రాదో వాళ్లిద్దరూ ఇవాళ కింద ఉన్నారు. మీరు అరిస్తే (ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి) వచ్చే మాటలు కూడా రావు. నాకు త్రివిక్రమ్ గారి ముందు గానీ, తారక్ అన్న ముందు గానీ మాట్లాడాలంటే భయం. మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసి అరవకుండా ఉంటే మాట్లాడతా'' అని నాగవంశీ చెప్పారు.

Also Read: అమ్మకు అంకితం... తల్లి మీద సాయి దుర్గా తేజ్ ప్రేమ, గౌరవానికి ఫిల్మ్ ఫేర్ సలామ్