NTR Prashanth Neel Movie Release Date Locked : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న మూవీ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతోన్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ రివీల్ చేశారు. అంతే కాకుండా టైటిల్ గ్లింప్స్ అప్డేట్ కూడా ఇచ్చారు.
రిలీజ్ ఎప్పుడంటే?
డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) మూవీ వరల్డ్ వైడ్‌గా వచ్చే ఏడాది జూన్ 11న రిలీజ్ కానుందని అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఫస్ట్ గ్లింప్స్‌ను ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్‌గా మే 20న రిలీజ్ చేస్తామంటూ తారక్ షాడో పోస్టర్ షేర్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అయినప్పటి నుంచీ ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. బర్త్ డే రోజున ఏదైనా అప్డేట్ ఉండొచ్చని భావించారు. అనుకున్నట్లుగానే ఆ రోజున గ్లింప్స్ రానుండగా... రిలీజ్ డేట్‌పై కూడా క్లారిటీ వచ్చేసింది.
Also Read : నో కాస్ట్ - నో రిలీజియన్ సర్టిఫికెట్ గ్రాంటెడ్ - అసలు రీజన్ చెప్పిన తమిళ నటుడు పార్తిబన్
షూటింగ్ అప్డేట్
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... ఈ ఏడాది చివర్లో రిలీజ్ ఉంటుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావించారు. ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో కాస్త నిరాశ చెందారు. రీసెంట్‌గా మూవీ షూటింగ్‌కు బ్రేక్ పడిందనే రూమర్స్ వచ్చినా నిర్మాతలు దానిపై క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ లుక్‌పై అసంతృప్తి కారణంగా షూటింగ్ వాయిదా అంటూ ప్రచారం సాగగా... స్వయంగా ఎన్టీఆర్ సైతం కొత్త లుక్ పోస్ట్ చేసి వాటికి చెక్ పెట్టారు.
ఈ మూవీలో మాస్ లుక్ కోసం ఎన్టీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే విదేశాల్లో షెడ్యూల్స్ కంప్లీట్ కాగా... రీసెంట్‌గా శంషాబాద్ సమీపంలోని ఓ ఆలయంలో దాదాపు వారం రోజుల పాటు షూటింగ్ జరిగింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తుండగా... భారీ సెట్ కూడా వేసినట్లు సమాచారం. ఎన్టీఆర్‌పై భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న మూవీలో ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. విలన్ రోల్‌లో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా... మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నారు.
