Hrithik Roshan NTR Romantic Single From War 2 Released: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ అవెయిటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' నుంచి ఫస్ట్ ట్రాక్ వచ్చేసింది. హృతిక్, కియారా అద్వానీల రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

'ఊపిరి ఊయలగా'

'నీ గుండె గుమ్మంలోకి ప్రతీ రోజూ వస్తూ పోతుంటా ఊపిరి ఊయలగా...' అంటూ ఫుల్ రొమాంటిక్ స్వింగ్‌లో సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. 'బ్రహ్మాస్త్ర'లోని బ్లాక్‌ బస్టర్ సాంగ్ 'కేసరియా' పాటని కంపోజ్ చేసిన టీం ఈ రొమాంటిక్ సాంగ్ రూపొందించారు. ఈ పాటకు తెలుగులో చంద్రబోస్ లిరిక్స్ అందించగా... శాశ్వత్ సింగ్, నిఖితా గాంధీ ఆలపించారు. హృతిక్, కియారా కెమిస్ట్రీ, పాటను తెరకెక్కించిన విధానం, లోకేషన్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. హిందీలో ఈ పాటకు ప్రీతమ్ బాణీ, అమితాబ్ భట్టాచార్య లిరిక్స్, అరిజిత్ సింగ్ గాత్రాన్ని అందించారు. కియారా బర్త్ డే సందర్భంగా ఈ సాంగ్‌ను విడుదల చేశారు.

Also Read: ప్రాణ స్నేహితులే రాజకీయ శత్రువులు - రాష్ట్ర విధిని మార్చిన కథ... ఆసక్తికరంగా 'మయసభ' ట్రైలర్

War 2 Trailer Reaction: ఇటీవలే 'వార్ 2' ట్రైలర్ రిలీజ్ చేయగా... ట్రెండింగ్‌లో నిలిచింది. ఎన్టీఆర్ (NTR) బాలీవుడ్ ఎంట్రీ మూవీ కావడంతో ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల (Hrithik Roshan) మధ్య యాక్షన్ సీన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో భాగంగా ఈ మూవీ ఆరో చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీలో ఎన్టీఆర్ స్పై అధికారిగా కనిపించనున్నారు.

ఇప్పటివరకూ ఎన్నడూ లేని విధంగా ఓ డిఫరెంట్ స్పై అధికారిగా మ్యాన్ ఆఫ్ మాసెస్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 14న హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ మూవీని రిలీజ్ చేస్తున్నారు. 2019లో వచ్చిన 'వార్'కు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కించారు. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. 

ఎన్టీఆర్, హృతిక్ మధ్య వార్ సీన్స్ మూవీకే హైలెట్ అని... భారీ స్థాయిలో ఇండియాలో రిలీజ్ కానున్న ఫస్ట్ మూవీ ఇదేనని మేకర్స్ వెల్లడించారు. మూవీ క్రేజ్ దృష్ట్యా ఆడియన్స్‌కు స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు డాల్బీ అట్‌మోస్ థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఇద్దరు సోల్జర్స్ మధ్య వార్ చూసేందుకు కొద్ది రోజులు ఆగాల్సిందే.