సినీ సెలబ్రిటీలు మాట్లాడే ప్రతీ మాటను ఆచితూచి మాట్లాడాలి. వారు మాట్లాడే ప్రతీ మాటలో నానార్థాలు వెతికి మరీ వైరల్ చేస్తారు కొందరు నెటిజన్లు. సినీ సెలబ్రిటీలు మాట్లాడే కొన్ని మాటలను ఏమార్చి మరీ వైరల్ చేస్తుంటారు. అది చాలాసార్లు ఆ సెలబ్రిటీల వరకు వెళ్లదు. ఒకవేళ వెళ్లినా.. కొందరు రియాక్ట్ అవ్వడానికి ఇష్టపడరు. కానీ నిత్యామీనన్ అలా కాదు.. తనకు ఏది నచ్చకపోయినా.. ఎందరి ముందు అయినా చెప్పడానికి వెనకాడదు. అలాంటి నిత్యామీనన్ తాజాగా ఒక తమిళ నటుడిపై ఘాటు వ్యాఖ్యలు చేసిందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇది జరిగి దాదాపు నెలరోజులు అవుతున్నా.. తాజాగా ఈ వార్త నిత్యామీనన్ వరకు చేరింది. దీంతో తను సోషల్ మీడియా ద్వారా స్పందించింది. అంతే కాకుండా ఈ రూమర్ క్రియేట్ చేశారు అనుకున్నవారికి వార్నింగ్ కూడా ఇచ్చింది.


నిత్యా కంటపడింది


నిత్యామీనన్.. తన సినిమాల ప్రమోషన్స్ సమయంలో కూడా ఎక్కువగా ఇంటర్వ్యూలో ఇవ్వదు. అలాంటిది నిత్యా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది అని, అందులో ఒక తమిళ హీరో తనను షూటింగ్ సమయంలో వేధించాడని వార్తలు వచ్చాయి. గత నెలరోజుల్లో ఈ వార్త విపరీతంగా వైరల్ అయ్యింది. ఇన్నాళ్లకు ఈ వార్త.. నిత్యామీనన్ కంటపడినట్టు ఉంది. అందుకే దానిని చూసి చూడనట్టు వదిలేయకుండా రియాక్ట్ అవ్వాలని డిసైడ్ అయ్యింది. దానికి సంబంధించి పోస్ట్‌ను నిత్యా పోస్ట్ చేయడంతో పాటు దానిపై తన రియాక్షన్‌ను చూపించింది.


చాలా బాధాకరం


‘‘తప్పు న్యూస్. అసలు నిజం కాదు. నేనెప్పుడూ ఒక ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఎవరికైనా తెలిస్తే.. అసలు ఈ రూమర్‌ను ఎవరు మొదలుపెట్టారో చూపించండి. కేవలం క్లిక్స్ కోసం ఇలాంటి తప్పు న్యూస్ తయారు చేస్తున్న వారు జవాబుదారీతనం వహించాలి’’ అని నిత్యామీనన్ పోస్ట్ చేసింది. దాంతో పాటు ‘‘జర్నలిజంలోని కొన్ని సెక్షన్స్ ఈ స్థాయికి దిగజారడం చాలా బాధాకరంగా ఉంది. ఇంతకంటే బెటర్‌గా ఉండండి అని కోరుకుంటున్నాను’’ అని క్యాప్షన్ కూడా పెట్టింది. ఆ తర్వాత ఒక మీమ్ పేజ్.. ఈ ఫేక్ వార్తను ప్రారంభించిందని అనుకున్న నిత్యా.. ఆ పేజ్ మీమ్‌ను ట్యాగ్ చేసి ‘‘షేమ్’’ అని క్యాప్షన్ పెట్టింది. దీంతో తమిళ హీరో తనను వేధించాడనే వార్త పూర్తిగా ఫేక్ అని నిత్యా మీనన్ ఫ్యాన్స్‌కు ఒక క్లారిటీ వచ్చింది.






తరువాతి ప్రాజెక్ట్స్


ప్రస్తుతం నిత్యా మీనన్.. తన తరువాతి ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు వెబ్ సిరీస్‌లు చేయడానికి కూడా నిత్యా వెనకాడడం లేదు. అందుకే ‘కుమారి శ్రీమతి’ అనే వెబ్ సిరీస్‌తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 28న ఈ సిరీస్ ప్రైమ్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలయిన ‘కుమారి శ్రీమతి’ ట్రైలర్‌కు విపరీతమైన ఆదరణ లభించింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇప్పటికే ‘తిరు’ అనే చిత్రంలో ధనుష్‌తో జతకట్టింది నిత్యా. అంతే కాకుండా ధనుష్ నటిస్తున్న 50వ చిత్రంలో కూడా నిత్యా హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. 


Also Read: ఆమె కలలు పెద్దవి - రష్మిక గురించి షాకింగ్ విషయం బయపెట్టిన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial