Nithiin's Thammudu Movie Release Date Announced: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin) అవెయిటెడ్ మూవీ 'తమ్ముడు' (Thammudu). ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచీ భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ వాయిదా పడగా.. అసలు రిలీజ్ ఎప్పుడా? అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా.. వారి సస్పెన్స్‌కు తెరపడింది.
రిలీజ్ ఎప్పుడంటే?
ఈ మూవీకి 'వకీల్ సాబ్' ఫేం వేణు శ్రీరామ్ (Venu Sriram) దర్శకత్వం వహిస్తుండగా ఆయన బర్త్ డే సందర్భంగా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ మూవీ టీం సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. జులై 4న ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఓ ఫన్నీ వీడియోతో చేయడం ఆసక్తి రేపింది.
హీరోయిన్స్ వర్ష బొల్లమ్మ (Varsha Bollamma), సప్తమి గౌడతో (Sapthami Gowda) పాటు ఒక్కొక్కరుగా యాక్టర్స్ దర్శకుడు వేణు శ్రీరామ్ దగ్గరకు వస్తూ ఉంటారు. బర్త్ డే విషెష్ చెప్పేందుకే వస్తున్నారని ఆయన భావించగా.. మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడంటూ అసహనంగా అడగడం.. వేణు శ్రీరామ్ ఫన్నీగా ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం నవ్వులు పూయించింది. త్వరగా రిలీజ్ డేట్ చెప్తే ప్రమోషన్స్ చేసుకుంటామంటూ వాళ్లు అడగడం ఫన్నీగా ఉంటుంది. చివరకు నిర్మాత దిల్ రాజు ఆయనతో కేక్ కట్ చేయించి రిలీజ్ డేట్ చెప్పారు.
Also Read: 'పెళ్లిచూపులు' హీరోయిన్ తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ టైటిల్‌తో నితిన్ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచీ మూవీపై స్పెషల్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. 'వకీల్ సాబ్' డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. నితిన్ సరసన కాంతార ఫేం సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు.
సిస్టర్ సెంటిమెంట్.. అదిరిపోయే యాక్షన్ ఎంటర్‌టైనర్
అక్క సెంటిమెంట్‌తో మూవీ ఉండబోతుందని తెలుస్తుండగా.. లయ నితిన్ అక్క పాత్ర పోషించనున్నారు. ఈ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేయగా.. ఓ చిన్నారిని భుజంపై ఎత్తుకుని చేతిలో కాగడాతో నితిన్ పరిగెడుతుంటారు. కొందరు వెనుక నుంచి తరుముకొస్తుండగా పాపను రక్షించేందుకు తపన పడుతుండడం కనిపించింది. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ మూవీలో ఉండబోతుందని అర్థమవుతోంది. ఇటీవల నితిన్ 'రాబిన్ హుడ్' నిరాశపరచగా.. ఇప్పుడు 'తమ్ముడు' మూవీ సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తున్నారు.