యువ కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) కెరీర్ గురించి చెప్పాల్సి వస్తే... 'కార్తికేయ 2'కు ముందు, ఆ సినిమా తర్వాత అని చెప్పాలి. పాన్ ఇండియా సెన్సేషన్ 'కార్తికేయ 2'తో ఆయనకు దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ హిట్ తర్వాత ఆయన మరో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టు చేస్తున్నారు. అదే 'స్వయంభు'. పూర్తి వివరాల్లోకి వెళితే... 


700 మంది ఆర్టిస్టులు... 8 కోట్ల బడ్జెట్...
పన్నెండు రోజులు భారీ యాక్షన్ సీక్వెన్స్!
భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ 'స్వయంభు' రూపొందుతోంది. 'ఠాగూర్' మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. భువన్, శ్రీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హీరోగా నిఖిల్ 20వ చిత్రమిది. ఆయన కెరీర్‌ చూస్తే... అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ సినిమా అవుతుందని చెప్పవచ్చు. ఈ మూవీ కోసం ప్రస్తుతం భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు.


'స్వయంభు' కోసం నిఖిల్ యుద్ధ విద్యల్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. ఆ ఒక్క ఎపిసోడ్ కోసం రూ. 8 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. సుమారు 700 మంది జూనియర్ ఆర్టిస్టులు, ఇంకా ప్రధాన తారాగణం మీద 12 రోజుల పాటు ఆ సీక్వెన్స్ షూట్ చేయనున్నారు. సినిమాలోని మేజర్ హైలైట్స్‌లో ఇదొకటి అని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన స్టిల్ చూస్తే... వేలాది మంది జనం మధ్యలో యాక్షన్ చేస్తున్నట్లు అర్థం అవుతోంది. రోజు రోజుకూ ఈ మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి.


Also Read: మారుతిని మరింత వెయిటింగ్‌లో పెడుతున్న ప్రభాస్ - ఏంటిది రాజా సాబ్?






నిఖిల్ సరసన ఇద్దరమ్మాయిలు!
Swayambhu Movie Actress: 'స్వయంభు' సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉంది. అందులో ఒకరు సంయుక్త. మరొకరు నభా నటేష్. ఒకరు మలయాళీ కాగా ఇంకొకరు కన్నడిగ. యువరాణి తరహాలో విడుదల చేసిన నభా నటేష్ ఫస్ట్ లుక్ ఆమెను కొత్తగా చూపించింది. సంయుక్త లుక్ సైతం బావుంది.


Also Readగీతాంజలి మళ్ళీ వచ్చింది... ఈ రాత్రి నుంచి స్ట్రీమింగ్ షురూ, ఏ ఓటీటీలోనో తెలుసా?



'స్వయంభు' విషయంలో దర్శక నిర్మాతలు అసలు రాజీ పడటం లేదు. ఇండియా నుంచి టాప్ టెక్నీషియన్లను తీసుకు వచ్చారు. 'కెజియఫ్', 'సలార్' ఫేమ్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా... టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలతో పలు హిట్ సినిమాలు తీసిన మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్. ఈ చిత్రానికి సంభాషణలు: వాసుదేవ్ మునెప్పగారి, ప్రొడక్షన్ డిజైనర్: ఎం ప్రభాహరన్, సహ నిర్మాతలు: విజయ్ కామిశెట్టి - జిటి ఆనంద్, నిర్మాతలు: భువన్ - శ్రీకర్, నిర్మాణ సంస్థ: పిక్సెల్ స్టూడియోస్, సమర్పణ: ఠాగూర్ మధు, రచన & దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి.