నిహాల్ కథానాయకుడిగా నటించిన సినిమా 'సందిగ్ధం'. ఇందులో ప్రియా దేశ్‌పాగ్ హీరోయిన్. అర్జున్ సిహెచ్, కాజల్ తివారి ప్రధాన పాత్రలు పోషించారు. పార్థసారథి కొమ్మోజు దర్శకత్వంలో తీర్థ క్రియేషన్స్ పతాకంపై సంధ్య తిరువీధుల ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... 

విడుదలకు 'సందిగ్ధం''సందిగ్ధం' చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తి అయ్యాయని, సెన్సార్ కార్యక్రమాలు త్వరలో పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు. సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత విడుదల తేదీని అనౌన్స్ చేస్తామని పేర్కొన్నారు.

Also ReadTrisha Vs Parthiban: తప్పు... తప్పుడు పని... త్రిషకు సారీ చెబుతూ సెటైర్ వేసిన పార్తీబన్

Sandigdham Cast: 'సందిగ్ధం' సినిమాలో హీరో హీరోయిన్లు కొత్తవాళ్లు అయినప్పటికీ... జీవ కోచెర్ల, నవీన్ రాజ్ సంకరపు, చిట్టి బాబు, ఆనంద్ భారతి, 'రైజింగ్' రాజు, 'జబర్దస్త్' అప్పారావు, 'జబర్దస్త్' నాగి, దుర్గ, శ్రీ దేవీ, లక్ష్మణ్ రావు తదితరులు క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేశారు. ఈ చిత్రానికి గౌతమ్ రవి రామ్ సంగీతాన్ని అందిస్తుండగా... నందన్ కృష్ణ ఛాయాగ్రాహకుడిగా పని చేస్తున్నారు.

Also ReadVaralaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ vs సాయి మాధవ్ బుర్రా: 'సరస్వతి' వివాదం... కథను మార్చారా? అసలు ఏం జరిగింది?