Nidhhi Agerwal Special Poster From The Raja Saab Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అవెయిటెడ్ రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్ 'ది రాజాసాబ్'. స్టార్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ తర్వాత ఎలాంటి అప్డేట్స్ లేవు. తాజాగా... హీరోయిన్ నిధి అగర్వాల్ బర్త్ డే సందర్భంగా అమె స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
అందాల 'నిధి'
నిధి అగర్వాల్‌కు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెష్ చెబుతూనే స్పెషల్ పోస్టర్ రివీల్ చేశారు. ఇందులో ఆమె దేవుడిని ప్రార్థిస్తున్నట్లుగా ఆకట్టుకుంటోంది. 'నిధి అగర్వాల్‌కు బర్త్ డే విషెష్. ది రాజాసాబ్ మూవీలో ఆమె రోల్ గ్రేస్, మరింత లోతుకు తీసుకు రావడానికి సిద్ధంగా ఉంది.' అంటూ మూవీ టీం రాసుకొచ్చింది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌లో నిధి క్యారెక్టర్ ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసింది. ఈ మూవీలో ఆమె అందంతో పాటు నటనకు ప్రాధాన్యమున్న ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల 'హరిహర వీరమల్లు' కాస్త నిరాశపరిచినా మూవీలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు 'ది రాజాసాబ్' మూవీలోనూ నిధి అగర్వాల్ తన అందం, అభినయం, యాక్టింగ్‌తో అలరించనున్నారు.
Also Read: 'భోళా శంకర్' మూవీ రిజల్ట్ - ప్రొడ్యూసర్‌ను చూసి జాలిపడ్డ క్లర్క్... ఆ స్టోరీ ఏంటో తెలుసా?
ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తుండగా... ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో టీజీ విశ్వప్రసాద్ మూవీని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
మూవీ రిలీజ్ వాయిదా పడుతుందా?
ఈ మూవీని ఈ ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ చేస్తామని పలుమార్లు టీం ప్రకటించింది. అయితే, వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం, ఇతర కారణాలతో వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే, దీనిపై ఇప్పటివరకూ మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అటు, ఢిల్లీకి చెందిన IVY ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ 'ది రాజా సాబ్' నిర్మాతలపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. చెప్పిన టైం ప్రకారం మూవీని పూర్తి చేసి రిలీజ్ చేయలేదని... ఒప్పందాలు ఉల్లంఘిస్తున్నారని తమ పెట్టుబడితో సహా రూ.400 కోట్లు కట్టాలని డిమాండ్ చేసింది.