Rajamouli Comments On Hanuman In GlobeTrotter Event : దర్శక ధీరుడు రాజమౌళిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. శనివారం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా GlobeTrotter ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. 'వారణాసి' మూవీలో మహేష్ బాబు ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ గ్లింప్స్‌ను 100 అడుగుల భారీ స్క్రీన్‌పై ప్లే చేశారు. అయితే, ఈ సందర్భంగా టెక్నికల్ గ్లిచ్ వల్ల వీడియో ప్లే కాలేదు. దీంతో ఓ అరగంట తర్వాత మళ్లీ ప్లే చేశారు. ఈ క్రమంలో రాజమౌళి హనుమాన్‌పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

Continues below advertisement

'హనుమాన్ నడిపిస్తున్నాడు'

ఈ మూవీలో మహేష్ విశ్వరూపం చూస్తామని... రాజమౌళిని హనుమాన్ దగ్గరుండి నడిపిస్తున్నాడని ఆయన తండ్రి, కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ అన్నారు. 'సీజీ, డబ్బింగ్, రీ రికార్డింగ్ ఇవేవీ లేకపోయినా మహేష్ నటన నన్ను మంత్ర ముగ్ధుడిని చేసింది. కొన్ని సినిమాలు మనుషులు తెరకెక్కిస్తే కొన్ని మాత్రం దైవ నిర్ణయంతో జరుగుతాయి. రాజమౌళి గుండెపై హనుమాన్ ఉన్నాడు. ఏం చేయాలో కర్తవ్య బోధ చేస్తూ ఉన్నాడు. ఆయన వెనకుండి నడిపిస్తున్నాడు. ఆయన ద్వారా మాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. రాముడు వారధి కడితే ఉడతా భక్తిగా కొందరు రాళ్లు ఎలా అందించారో... అలా మాకు ఈ అదృష్టం కలిసొచ్చింది.' అంటూ చెప్పారు.

Continues below advertisement

'ఇదేనా నడిపించేది'

ఆ తర్వాత 'వారణాసి' టైటిల్ గ్లింప్స్ ప్లే అయిన తర్వాత టెక్నికల్ గ్లిచ్ వల్ల ఆలస్యం కావడంపై రాజమౌళి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. 'నాకు దేవుడంటే పెద్దగా నమ్మకం లేదు. హనుమాన్ నా వెనుక ఉండి నడిపిస్తాడని చెప్పారు. ఇలా అయిన వెంటనే నాకు కోపం వచ్చింది. ఇదేనా నడిపించేది అని' అంటూ కామెంట్ చేశారు.

Also Read : ది వరల్డ్ ఆఫ్ 'వారణాసి' - సృష్టి ఆవిర్భావం To కలియుగం... రామయ్యను ఎత్తుకున్న వానర సైన్యం... అసలు స్టోరీ ఏంటంటే?

నెటిజన్ల ఫైర్

అయితే, చిన్న సమస్య వల్ల వీడియో ప్లే కాకుంటే దానికి దేవున్ని తప్పుబట్టడం ఏంటని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శిస్తున్నారు. కొందరు జక్కన్నను నేరుగానే ప్రశ్నిస్తున్నారు. 'అందరికీ చూపించాల్సిన ఈవెంట్‌ను జియో హాట్ స్టార్ ఇన్ కం పెంచడానికి వాడి హనుమాన్‌ను ఎందుకు సార్ తప్పుబట్టడం. అసలు దేవున్ని నమ్మనప్పుడు ఆయన మీద కోపగించకండి. అప్పుడప్పుడు ఇలాంటి టెక్నికల్ గ్లిచ్చెస్ సహజమే. మీ సినిమా హైప్ ఏ మాత్రం తగ్గదు. కానీ మీరు అన్న మాటలు మాత్రం మిగిలిపోతాయి.' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.